ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏదుళ్లకు నిధుల కేటాయింపుపై హర్షం

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:48 AM

డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుళ్ల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపి, రూ.1800 కోట్లు కేటాయించినందుకు సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్‌, సీపీఐ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, నెల్లికంటి సత్యం, పల్లా నర్సింహారెడ్డి

నల్లగొండ రూరల్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుళ్ల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపి, రూ.1800 కోట్లు కేటాయించినందుకు సీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌లతో కలిసి సోమవారం హైదరా బాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు మాట్లాడుతూ ఫ్లోరైడ్‌తో జీవచ్ఛవాలుగా కరువు ఎడారిగా మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు ఉన్నాయ న్నారు. ఈ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం కోసం దశాబ్దాలుగా పార్టీ అనేక ఉద్యమాలు, పోరాటాలు, పాదయాత్రలు నిర్వహించిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ పది సంవత్సరాల్లో డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీరు తీసుకోవాలనే దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉండిపోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టిందని వారు పేర్కొన్నారు.

డిండి ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించడం అభినందనీయం

ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం అభినందనీయమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని దొడ్డి కొమరయ్య భవనంలో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. డబ్బికార్‌ మల్లేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, హాషం, ప్రమీల, ప్రభావతి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బాలునాయక్‌

దేవరకొండ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఎదుళ్ల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈసందర్భంగా సోమవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డికి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల లిప్టుల నిర్మాణ పనులకు అధిక నిధులు కేటాయించి పూర్తి చేస్తామని సీఎం తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందించడమే లక్ష్యంగా ముం దుకు వెళుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎంను కలిసినవారిలో చందంపేట మాజీ ఎంపీపీ ఎర్పుల గోవిందు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:48 AM