Bhatti Vikramarka: ఏఐసీసీ సమావేశాల ముసాయిదా కమిటీ భేటీకి హాజరైన భట్టి

ABN, Publish Date - Mar 29 , 2025 | 04:48 AM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ఏఐసీసీ సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించిన ముసాయిదా కమిటీ సమావేశమైంది. శు

Bhatti Vikramarka: ఏఐసీసీ సమావేశాల ముసాయిదా కమిటీ భేటీకి హాజరైన భట్టి

న్యూఢిల్లీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ఏఐసీసీ సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించిన ముసాయిదా కమిటీ సమావేశమైంది. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ముసాయిదా కమిటీ కన్వీనర్‌ రన్‌దీ్‌ప సింగ్‌ సూర్జేవాలా నేతృత్వంలో జరిగిన భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మిగిలిన సభ్యులూ హాజరయ్యారు.


రెండు రోజుల పాటు జరిగే సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ప్రతినిధుల సమావేశాలకు సంబంధించి అజెండా, ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఏఐసీసీ ప్రతినిధులు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 04:48 AM