పది పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన డీఈవో
ABN, Publish Date - Mar 26 , 2025 | 11:31 PM
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్ సూచించారు.

వెల్దండ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్‌స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో తనిఖీ చేశారు. పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రానికి చేరుకున్న రమేష్‌కుమార్ కేంద్రం వద్ద విద్యార్థులకు కల్పించాల్సిన వసతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణిత పరీక్షకు 10,560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 25 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
పరీక్షల విధుల్లో ఉదాసీనత వద్దు
- ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు విజయలక్ష్మి
పదవ తరగతి పరీక్షల విధుల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు విజయలక్ష్మి హెచ్చరించారు. బుధవారం మండలకేంద్రంలో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో డీఈవో రమేష్‌కుమార్‌తో కలిసి విజయలక్ష్మి మాట్లాడారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే బాధ్యత చీఫ్ సూపరిండెంట్‌లదేనన్నారు. ప్రతీతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతించాలన్నారు. కార్యక్రమంలో పరీక్ష నిర్వహణ అధికారులు భౌజేశ్వర్, శ్రవన్‌కుమార్, రవీందర్, రవికిరణ్ తదితరులు ఉన్నారు.
ఫ కల్వకుర్తి : కల్వకుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప దవ తరగతి పరీక్ష కేంద్రాన్ని డీఈవో రమేష్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ పరీక్ష కేంద్రంలో 130 మంది విద్యార్థులకు గాను ఒకరు గౌర్హారయ్యారని డీఈవో తెలిపారు.
Updated Date - Mar 26 , 2025 | 11:31 PM