హ్యామ్‌తో గ్రామీణ రోడ్ల అభివృద్ధి

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:31 PM

హైబ్రి డ్‌ ఎన్యూనిటీ మోడ్‌ (హ్యామ్‌)లో కల్వకుర్తి ని యోజకవర్గంలోని పంచాయతీరాజ్‌ రోడ్లను అభి వృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి తెలిపారు.

హ్యామ్‌తో గ్రామీణ రోడ్ల అభివృద్ధి
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- పైలట్‌ ప్రాజెక్టుగా కల్వకుర్తి నియోజకవర్గం

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : హైబ్రి డ్‌ ఎన్యూనిటీ మోడ్‌ (హ్యామ్‌)లో కల్వకుర్తి ని యోజకవర్గంలోని పంచాయతీరాజ్‌ రోడ్లను అభి వృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సహకారంతో దేశంలోనే మొదటి సారిగా హ్యామ్‌లో కల్వకుర్తి రోడ్లను మోడల్‌గా అభివృద్ధి పరిచి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పొల్యూష న్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు ఠాకూర్‌ బాలాజీ సింగ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌ కుమార్‌లతో కలిసి ఎమ్మెల్యే విలేకర్ల సమా వేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని వి ధంగా హైబ్రిడ్‌ ఎన్యూనిటీ మోడ్‌లో నియోజక వర్గంలోని పంచాయతీరాజ్‌ రోడ్లను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. తాను నియోజక వర్గం లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటా నని ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ.500 కోట్ల రూపాయలు మంజూరు చేయించామన్నా రు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు 189కోట్లు, పీఆర్‌ రోడ్లకు 91కోట్లు, ఇతర రోడ్లకు 15కోట్లు మంజూరు చే యించినట్లు తెలిపారు. హ్యామ్‌లో ప్రభుత్వం 40 శాతం నిధులిస్తూ మిగతా 60శాతం బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు.

ఉనికి చాటుకోవడానికే ప్రతిపక్షాల విమర్శలు

ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉనికి చాటుకో వడానికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీ నెల రూ.6500 కోట్లు వడ్డీ కడుతున్నట్లు తెలిపారు. రైతు భరోసా రైతులందరికీ అందిస్తామని తెలిపారు.

12న మాడ్గులకు మంత్రి సీతక్క రాక

కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మం డలంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలకు మంత్రి సీతక్క హాజర వుతున్నట్లు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. విలేకర్ల సమావేశంలో పీఆర్‌ డిప్యూటీ ఈఈ బసవలింగం, సంజీవ్‌కుమార్‌యాదవ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాయితీ విజయ్‌ కుమార్‌రెడ్డి, నాయకులు హనుమా నాయక్‌, రవి, హరీశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:31 PM