ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంక్షలు లేకుండా రైతు భరోసా..

ABN, Publish Date - Jan 06 , 2025 | 02:18 AM

రైతుభరోసా పథకం అమలుపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. పథకాన్ని ఈ సీజన్‌ నుంచే అమలు చేస్తారా, వచ్చే సీజన్‌ నుంచి అమలు చేస్తారా, సాగు భూములకే ఇస్తారా, ధరణి పోర్టల్‌లో పట్టా కలిగిన రైతులందరికీ ఇస్తారా, భూములపై సీలింగ్‌ విధిస్తారా, మొత్తం భూమికి ఇస్తారా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఐటీ చెల్లింపుదారులకు ఇస్తారా, ఇవ్వరా అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎలాంటి ఆంక్షలు విధించకుండానే సాగు చేసే భూములకే భరోసా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.

- ఈ యాసంగి నుంచే పథకం అమలు

- సాగు చేసే భూములకే రైతు భరోసా

- ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు పంటలకు రూ. 12 వేలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రైతుభరోసా పథకం అమలుపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. పథకాన్ని ఈ సీజన్‌ నుంచే అమలు చేస్తారా, వచ్చే సీజన్‌ నుంచి అమలు చేస్తారా, సాగు భూములకే ఇస్తారా, ధరణి పోర్టల్‌లో పట్టా కలిగిన రైతులందరికీ ఇస్తారా, భూములపై సీలింగ్‌ విధిస్తారా, మొత్తం భూమికి ఇస్తారా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఐటీ చెల్లింపుదారులకు ఇస్తారా, ఇవ్వరా అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎలాంటి ఆంక్షలు విధించకుండానే సాగు చేసే భూములకే భరోసా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఎలాంటి దరఖాస్తులు లేకుండా జనవరి 26వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం జిల్లాలో 2 లక్షల 60 వేల ఎకరాల భూములకు వర్తించే అవకాశాలున్నాయి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని ఈ యాసంగి సీజన్‌ నుంచి ప్రారంభించాలని శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఎకరానికి 7,500 రూపాయల చొప్పున గాకుండా 6 వేల చొప్పున రెండు పంటలకు కలిపి 12 వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఎకరానికి 1500 రూపాయలు తగ్గించడంపై ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. జిల్లాలో 1,55,496 మంది రైతులు 2,78,128 ఎకరాల భూములు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ద్వారా ఆయా సీజన్లలో పెరిగిన పట్టాదారులను అనుసరించి గత ఏడాది వర్షాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 1,46,819 మంది రైతులకు ఎకరానికి 5వేల చొప్పున 2,72,292 ఎకరాల భూములకు 136 కోట్ల 14 లక్షల 60 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా 67,332 మంది రైతులకు ఏడాదికి 6 వేల చొప్పున 40 కోట్ల 39 లక్షల 92 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.

ఫ జిల్లాలో 2.60 లక్షల ఎకరాలకు...

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా ప్రకారం రాళ్లు, రప్పలు, గుట్టలు, నాలా కన్వర్షన్‌ చేయకుండా రియల్‌ ఎస్టేట్‌ కోసం ప్లాటింగ్‌ చేసిన భూములు, ప్రజల ఉపయోగం కోసం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రం రైతుభరోసా పథకాన్ని వర్తింపజేయమని పేర్కొంది. రుణమాఫీ పథకాన్ని వర్తింపజేసినట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఆదాయ చెల్లింపుదారులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయరని, పెద్దఎత్తున భూములు కలిగిన భూస్వాములకు గాకుండా 10 ఎకరాల వరకు సీలింగ్‌ విధిస్తారని అంతా భావించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటలు సాగయ్యే భూముల యజమానులకు మాత్రమే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో 2లక్షల 60 వేల ఎకరాలకు రైతు భరోసా వర్తించే అవకాశాలున్నాయి. ఆ లెక్కన ప్రభుత్వం ఈ సీజన్‌లో ఎకరానికి 6వేల రూపాయల చొప్పున 156 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా జిల్లాలో యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను బట్టి 2లక్షల 20వేల ఎకరాల భూములను రైతులు సాగుచేస్తున్నారు. దీర్ఘకాలిక పంట అయిన పత్తి పండించే రైతులకు రెండు సీజన్లకు రైతు భరోసా ఇస్తారా లేక ఒకటే సీజన్‌కు ఇస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున గాకుండా 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. పథకం అమలు చేయడంలో ఆంక్షలు విధిస్తారని అందరు ఊహించినప్పటికీ, అందరి ఊహలను పటాపంచలు చేసిన ప్రభుత్వం ఎకరానికి 1500 రూపాయలు తగ్గించుకుని అందరికీ, ఎలాంటి సీలింగ్‌ లేకుండా వర్తింపచేస్తామని ప్రకటించడం గమనార్హం. రైతు కూలీలకు ఏడాదికి 12వేల చొప్పున ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఇంకా దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయలేదు.

Updated Date - Jan 06 , 2025 | 02:19 AM