Holi 2025: హోలీ రోజు వాళ్లకు పండగే.. సెలవైనా తగ్గేదేలే..

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:50 PM

హోలీ పండుగను మందు బాబులు మందు పండుగ చేసేశారు. మద్యం అమ్మకాలు నిలిపివేసినా.. అడ్డదారుల్లో కొనుక్కుని తాగుతున్నారు. అంతటితో ఆగకుండా రంగులు పూసుకునే నెపంతో గొడవలు పెట్టుకుంటున్నారు.

Holi 2025: హోలీ రోజు వాళ్లకు పండగే.. సెలవైనా తగ్గేదేలే..

పండుగ ఏదైనా కావచ్చు.. మందు బాబుల సందడి మాత్రం తప్పకుండా ఉంటుంది. రంగుల పండుగ హోలీ రోజున కూడా మందు బాబులు తమ మార్కు చూపిస్తున్నారు. మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. అల్లర్లు సృష్టిస్తున్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మందు బాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. కొంతమంది విపరీతంగా మందు తాగి, రంగులు చల్లే నెపంతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఆడ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో హోళీ పండుగల రోజు మందు బాబుల అసాంఘిక కార్యకలాపాలు పీక్‌లోకి వెళుతున్నా యి. అందుకే పోలీసు శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ పండుగ రోజు తాత్కాళికంగా మద్యం విక్రయాలు నిలిపివేసింది. నగరంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపివేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, మద్యం దుకాణాల యజమానులతో పాటు మందు బాబులకు పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


రంగుల పండుగన .. మందు పండుగ

హోలీ రోజు మద్యం సేల్స్ నిలిపివేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మందు బాబులు అడ్డదారుల్లో మందు కొనుగోలు చేస్తున్నారు. పీకల దాకా తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. రంగులు పూసుకునే నెపంతో గొడవలు పెట్టుకుంటున్నారు. అంతటితో ఆగకుండా.. రంగుల స్థానంలో గుడ్లు, టమోటాలు వాడుతున్నారు. వీధుల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నారు. రోడ్లపై వెళ్లేవారిపై కూడా రంగులు చల్లుతున్నారు. పిల్లలు, ఆడవారిని కూడా వదలటం లేదు. మందు బాబులకు అడ్డదారుల్లో మందు విచ్చలవిడిగా దొరుకుతోందని తెలిసినా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఆదాయం వస్తోంది కదా అని చూసీ, చూడనట్లు ఉండిపోతున్నారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజు కంటే హోలీ పండుగ రోజు బ్లాక్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి.


పిడిగుద్దులాట గురించి తెలుసా?..

నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని హున్సా గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. ఈ గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాటను నిర్వహిస్తారు. దాదాపు 125 ఏళ్లనుంచి ఈ ఆచారం నడుస్తోంది. ఈ ఏడాది కూడా పిడిగుద్దులాటను నిర్వహించాలని గ్రామస్తులు భావించారు. అయితే, ఇందుకు పోలీసులు పర్మీషన్ ఇవ్వలేదు. దీంతో గ్రామస్తులు సమావేశమరు. ఆటను నిర్వహిద్దామా? వద్దా? అని తీవ్రంగా చర్చించారు. పోలీసుల అనుమతి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది తెలియాలి. పోలీసులు పర్మీషన్ ఇస్తే.. సాయంత్రం 6 గంటలకు పిడి గుద్దుల ఆట ప్రారంభం అవుతుంది.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా

Holi - Water Borne Infections: హోలీ పండగ ఎంజాయ్ చేస్తున్నారా.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 12:52 PM