Share News

Toll Plaza: కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు

ABN , Publish Date - Jan 12 , 2025 | 08:20 AM

సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు.దీంతో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతోంది.

Toll Plaza: కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద  బారులు తీరుతున్న వాహనాలు
Sankranti Effect

హైదరాబాద్: సంక్రాంతి పండుగను (Sankranti Festival) సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు (Travelers) తరలివస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు (Buses), రైళ్లు (Trains) కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగుతోంది. కొర్లపాడు టోల్ ప్లాజా (Toll Plaza) వద్ద వాహనాలు (Vehicles ) బారులు తీరుతున్నాయి. నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అలాగే చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌తో నిదానంగా వాహనాల ప్రయాణం సాగుతోంది. రవాణా అధికారుల అంచనా ప్రకారం శనివారం ఒక్కరోజే 4 లక్షల మంది హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2లక్షల మంది వచ్చారని అంచనా. మరో 2లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబ్‌ల్లో వస్తున్నారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.


ప్రయాణీకుల ఆగ్రహం...

కాగా సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు. బారులు తీరిన బస్సులు.. కిక్కిరిసిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ (ఎంజీబీఎస్‌), జూబ్లీ బస్‌స్టేషన్‌(జేబీఎస్)లలో అడుగు తీస్తే అడుగుపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. కాగా పండుగ పేరిట ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


32 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలు

పెద్దఅంబర్‌పేట నుంచి చౌటుప్పల్‌ వరకు 32 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు వాపోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనాలు నెమ్మదించాయి. ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను పర్యవేక్షించారు. చౌటుప్పల్‌, సూర్యాపేట పట్టణంలో ఎన్‌హెచ్‌-65పై ప్లైఓవర్లు నిర్మిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. గత ఏడాదితో పోల్చితే ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య 30 శాతం పెరిగినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుం డా పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌ పరిసరాల నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు వెళ్లి వచ్చేందుకు ఆర్టీసీ 146 సీటీ బస్సులను నడుపుతోంది. ఇక పండుగ కోసం రెండు నెలల ముందుగానే రైళ్లలో వెళ్లడానికి రిజర్వేషన్‌ కోసం ప్రయత్నిస్తే దొరకకపోవడంతో ప్రయాణికులకు అవస్థ లు తప్పడం లేదు. మరోవైపు.. నిబంధనలు ఉల్లంఘి స్తూ తిరుగు తున్న 250కిపైగా ప్రైవేటు బస్సులు, ఇత ర వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్నారా.. జాగ్రత్త..

ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాక్..

యువతిపై పగబట్టిన కోతి.. కాపాడాలని..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 12 , 2025 | 08:20 AM