ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pigeon Racing: పరిగిలో పావురాల రేసు

ABN, Publish Date - Jan 05 , 2025 | 02:49 AM

ఇప్పటి వరకు కోడి పందాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌, కారు, బైక్‌ రేసులు, వీడియో గేములు చూశాం. భారీగా డబ్బు చేతులు మారుతుంటుందనీ తెలుసు. తాజాగా వికారాబాద్‌ జిల్లా పరిగిలో కొందరు వ్యక్తులు పావురాల రేసు నిర్వహిస్తుండడం వెలుగుచూసింది.

ఏపీ నుంచి బాక్సుల్లో కపోతాలను తెచ్చి గాల్లోకి వదులుతుండగా పట్టివేత

16 బాక్సుల్లో 300కుపైగా పావురాలు

బాక్సులు, పావురాల కాళ్లకు కోడ్లు

500 కి.మీ.కు రేసు.. లక్షల్లో పందాలు!

పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు

పరిగి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు కోడి పందాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌, కారు, బైక్‌ రేసులు, వీడియో గేములు చూశాం. భారీగా డబ్బు చేతులు మారుతుంటుందనీ తెలుసు. తాజాగా వికారాబాద్‌ జిల్లా పరిగిలో కొందరు వ్యక్తులు పావురాల రేసు నిర్వహిస్తుండడం వెలుగుచూసింది. పరిగి పట్టణ శివారులోని లక్ష్మీ నగర్‌లో శనివారం ఉదయం వాహనంలో పావురాలను తీసుకొచ్చి బయటకు వదులుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ జిల్లా గోరంట్ల ప్రాంతానికి మునావర్‌, బాబు జానీ కలిసి ఓ వాహనంలో 16 బాక్సుల్లో పావురాలను పరిగికి తీసుకొచ్చారు. ఒక్కో బాక్సులో 20 వరకు... మొత్తం 300కుపైగా పావురాలు ఉన్నాయి. స్థానికులు వారిని ప్రశ్నించగా పావురాలకు శిక్షణ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. తర్వాత పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని వాహనాన్ని, పావురాల బాక్సులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాక్సులకు, పావురాల కాళ్లకు కోడింగ్‌ ఉంది. దీంతో రేసింగ్‌ కోసమే తెచ్చినట్లు తెలుస్తోంది. నిందితులు రకరకాలుగా సమాధానాలు చెప్పినా చివరకు పావురాలను రేసింగ్‌ కోసమే తెచ్చామని ఒప్పుకున్నట్లు తెలిసింది. పరిగిలో వదిలిన పావురాలు వారు నిర్ణయించిన సమయంలో ఎంచుకున్న కేంద్రానికి చేరుకుంటే అవి ఎవరివో ఆ వ్యక్తి గెలిచినట్లు అని చెబుతున్నారు. దీనిపై లక్షల రూపాయల్లో పందాలు కాస్తున్నారని తెలిసింది. ఇంతకుముందు కూడా పరిగి ప్రాంతంలో రహస్యంగా అనేకసార్లు పావురాలను వదినట్లు విశ్వనీయ సమాచారం. ఈ రకం పావురం గంటకు 97 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందట. విశ్రాంతి పోను రోజుకు 985 కి.మీ నుంచి 1,128 కి.మీ వరకు ప్రయాణిస్తాయని చెబుతున్నారు. మరికొన్ని రకాల పావురాలు రోజుకు రెండు వేల కి.మీ దూరం కూడా ప్రయాణిస్తాయని చెబుతున్నారు. పరిగికి తీసుకొచ్చిన పావురాలతో 500 కి.మీ. దూరం రేసింగ్‌ పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కేసు విషయంలో వివరణ కోరగా పోలీసులు స్పందించలేదు

Updated Date - Jan 05 , 2025 | 02:49 AM