‘కల్యాణలక్ష్మి’ పథకం పేదలకు వరం
ABN, Publish Date - Jan 11 , 2025 | 01:03 AM
క ల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే వేముల వీరేశం అ న్నారు.
‘కల్యాణలక్ష్మి’ పథకం పేదలకు వరం
ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, జనవరి 10(ఆంధ్రజ్యోతి): క ల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే వేముల వీరేశం అ న్నారు. శుక్రవారం కట్టంగూరు, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మె ల్యే అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో కూడా శరవేగంగా ముందుకుసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పా ర్టీ కార్యకర్తలు స్ధానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూ చించారు. నకిరేకల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ట్లు తెలిపారు. కట్టంగూరులో 112 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గుగులోతు ప్రసాద్, కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి సాగర్, నాయకులు నంద్యాల వెంకట్‌రెడ్డి, బూరుగు శ్రీను, మిట్టపల్లి శివశంకర్, నర్సింహ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. వివిధ ఆధ్యాత్మిక, అభివృద్ధి సంక్షేమం, సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 50మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని కాకతీయ హైస్కూల్‌లో జరిగిన సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం మండలంలోని మాండ్ర గ్రామ శివారులో గల నార్లగుట్టపై ఉన్న లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నా రు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో ఉమే్‌షచారి, ఆర్‌ఐ తరుణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తు ల ఊశయ్య, నాయకులు బండా సాగర్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివా్‌సరెడ్డి, జెరిపోతుల భరత, పుల్లెంల అచ్చాలు, యాదయ్య, యాదయ్య, కృష్ణయ్య, స్వామిగౌడ్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో మునిసపల్ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన నర్రా వినోద, తహీసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో జయలక్ష్మి, సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 01:03 AM