పేదలకు మెరుగైన వైద్యం కోసం బస్తీ దవాఖానాలు
ABN, Publish Date - Jan 11 , 2025 | 01:09 AM
నియోజకవ ర్గంలోని పేదలకు, మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
- ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్ జనవరి 10(ఆంధ్రజ్యోతి) నియోజకవ ర్గంలోని పేదలకు, మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని 10వ వార్డులో బస్తీ దవఖానా, 36వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణాలకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో 24 బస్తీ దవఖానాలు మంజూరయ్యా యన్నారు. బస్తీ దవఖానాల ఏర్పాటుతో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలతోపాటు, టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవఖానాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు రోగం వచ్చిన తరువాత దవఖానాల చుట్టూ తిరిగేకన్నా అనారోగ్యం పాలుకాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవా లని అన్నారు. జగిత్యాల నలువైపులా మార్కెట్‌లు, పార్కులు అభివృద్ధి చేశామన్నారు. గతంలో పట్టణంలోని వార్డుల్లో చేసిన పనుల కన్నా తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు రేట్ల నిధులు అభివృద్ధికి మంజూరు చేయిం చానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, జిల్లా వైధ్యా ధికారి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, వైస్‌చైర్మన్ గోలి శీన్రివాస్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ భారతీ, మాజీ ఎంపీటీసీ రాజయ్య, నాయ కులు రాజయ్య, రాజ్‌కుమార్, సుధాకర్, పవన్ పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 01:10 AM