ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:57 AM

జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు.

పెద్దపల్లిటౌన్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కలెక్టర్‌ కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, ఎన్‌సీడీ సర్వే, డయాగ్నొస్టిక్‌ హబ్‌, ఎంఎల్‌హెచ్‌పీ పని తీరు వంటి పలు అంశాలపై కలెక్టర్‌ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా పర్యవేక్షణ జరగాలని, ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలన్నారు. గర్భిణులకు రెగ్యు లర్‌గా చెక్‌అప్‌ సకాలంలో జరగాలని, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్‌ 100 శాతం కావాలన్నారు. జిల్లాలో ఎన్‌సీడీ సర్వే బాగా జరుగుతుందని, ఇప్పటి వరకు 92శాతం సర్వే పూర్తయిందని, జనవరి నెలాఖరు వరకు మిగి లిన సర్వే పూర్తిచేసి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, అవసరమైన వారికి మందులు అందేలా చూడాలని తెలి పారు. డయాగ్నొస్టిక్‌ హబ్‌ ద్వారా ప్రస్తుతం 5 గంటల 20 నిమిషాల వ్యవధిలో ఫలితాలు అందిస్తున్నామని, దీనిని 4గంటలకు తగ్గించేందు కు ప్రణాళికలు తయారుచేయాలని సూచించారు. పరీక్ష నమూనాలు టీ హబ్‌కు త్వరగా చేరుకునేలా రవాణా వ్యవస్థ రీఆర్గనైజ్‌ చేసుకోవా లన్నారు. ఆర్‌బీఎస్‌కే బృందాల పిల్లలకు ఉన్న సమస్యలు గుర్తించ డంతో పాటు వాటికి చికిత్స అందించడం కూడా చాలా కీలకమని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:57 AM