ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:09 AM

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

ధర్మపురిలో ముగ్గులు వేస్తున్న యువతులు

జగిత్యాల అర్బన్‌, జనవరి 15 (ఆంద్రజ్యోతి): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. జగిత్యాల పట్టణంలో యువతులు తమ ఇళ్ల ముందు రంగురం గులతో అందమైన ముగ్గులు వేశారు. పిల్లలు, యువకులు గాలి పటాలు ఎగురవేసి అనందంగా గడిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అడువాల జ్యోతి, జిల్లా పరిషత్‌ మాజీ చెర్‌పర్సన్‌ దావ వసంత, మున్సిపల్‌ మాజీ చెర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ధర్మపురి: మండల కేంద్రంలో వివిధ వీధుల్లో మహిళలు, యువతులు, బాలికలు ఇళ్ల ముందు రంగు రంగులతో ముగ్గులు వేశారు. అంతకు ముందు ఉదయం నుంచియే అనేక మంది గోదావరి నదికి చేరుకున్నారు. అనంతరం స్థానిక లక్ష్మీనృసింహ స్వామి, అనుబంధ దేవాలయాలను సందర్శించారు. క్యూలైన్‌లో నిలబడి స్వామి వారలను దర్శనం చేసుకు న్నారు. కనుమ పండుగ రోజున మహాలక్ష్మి పూజలు, నోములు జరిపి పసుపు, కుంకుమలు పరస్పరం స్వీకరించారు.

మల్యాల: మండలంలో సంక్రాంతి సంబరాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇళ్ల ముందు రంగురంగుల రంగవళ్ళులను అలంకరించారు. మల్యా ల, ముత్యంపేట, తాటిపల్లి, రామన్నపేట తదితర గ్రామాల్లో ముగ్గుల పోటీలు, పతాంగుల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు.

రాయికల్‌: మండలంలోని ఇటిక్యాలలో మంగళవా రం సాయిబాబా మందిరం ఆవరణలో ముగ్గుల పోటీలతో పాటు గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు పోటాపోటీగా అందమైన ముగ్గులు వేశారు. నిఅనంతరం గెలుపొందిన విజేత లకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన చందనగిరి మనోహర్‌, కాటిపెల్లి గంగారెడ్డిను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సామల్ల లావణ్యవేణు, ఎంపీటీసీ కొమ్ముల రాధఆదిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ చంద్రశేఖర్‌, గ్రామ సేవా సమితి అధ్యక్షుడు నల్ల గంగారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: మండలంలోని గోధుర్‌, తిమ్మపూ ర్‌, యామపూర్‌, వేములకుర్తి, ఇబ్రహీంప ట్నం, డబ్బ, వర్షకొండ, కోమటికొండపూర్‌ తదితర గ్రామాల్లో మహిళలు పలు ఆలయాల్లోలో ప్రత్యేక పూజలు జరిపారు. ముగ్గుల పోటీలు నిర్వహించి ముగ్గులలో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. వేములకుర్తిలో క్రికెట్‌ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

కోరుట్ల: మకర సంక్రాంతి పర్వదినం పురస్కరిం చుకుని కోరుట్ల అయ్యప్ప ఆలయం మంగళవారం విశేష పూజలను నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల క్షేత్రంలో జ్యోతి దర్శనం పురస్కరించుకొని పట్టణంలోని అయ్యప్ప జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేదపండితులు పాలెపు రాంశర్మ, వినయ్‌ మంత్రోచ్ఛరణ మధ్య మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు స్వామివారికి ప్రత్యేక పూజలను జరిపా రు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు అంబటి శ్రీనివాస్‌, చిద్రాల నారాయణ, భక్తులు పాల్గొన్నారు.

- పట్టణంలోని పురాతన వేంకటేశ్వర ఆలయంలో సంక్రాంతి పర్వదినం, ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని ఉంజల్‌, ఏకాంత సేవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్‌ సేవను జరిపారు. దీపాల అంకరణలో స్వామి వారికి ప్రత్యేక దర్శనాన్ని అందించారు. కార్యక్రమంలో వేదపండితుడు బీర్నంది నరిసింహాచారి, భక్తులు పాల్గొన్నారు.

- కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో మహిళ సిబ్బంది స్టేషన్‌ అవరణలో ముగ్గులను వేసి వివిధ రకాల రంగులతో నింపి పండుగకు స్వాగతం పలికారు.

గొల్లపల్లి/బీర్‌పూర్‌/వెల్గటూర్‌/కొడిమ్యాల/మెట్‌పల్లిటౌన్‌/మెట్‌పల్లిరూరల్‌/మల్లాపూర్‌: గొల్లపల్లి, బీర్‌పూర్‌, వెల్గటూర్‌, కొడిమ్యాల,మెట్‌పల్లి పట్టణం, మండలం, మల్లాపూర్‌ మండలాల్లో సంక్రాంతి, కనుమ పర్వది నంను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలాల్లోని పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి.

Updated Date - Jan 16 , 2025 | 01:09 AM