ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

ABN, Publish Date - Feb 10 , 2025 | 01:01 AM

సామ్రాయి గోజరై కరాటే స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సిరిసి ల్ల పట్టణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ టు ఆల్‌ స్టైల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే, కుంగ్‌ ఫూ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ముగిసింది.

ముగిసిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు

సిరిసిల్ల టౌన్‌ ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : సామ్రాయి గోజరై కరాటే స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో సిరిసి ల్ల పట్టణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ టు ఆల్‌ స్టైల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే, కుంగ్‌ ఫూ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ ముగిసింది. ఆదివారం ఉదయం సిరిసిల్ల మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మంచి శ్రీనివాస్‌ రాష్ట్రస్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే అండ్‌ కుంగ్‌ ఫూ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శ్రీని వాస్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలు మార్షల్‌ ఆర్ట్స్‌ తప్పనిసరిగా నేర్చుకోవాలని అన్నారు రాష్ట్ర స్థాయి పోటీలను ఒక మహిళ సామ్రాయి గోజా రై కరాటే స్పోర్ట్స్‌ అకాడమీ ఎండి సమీనా నిర్వహిం చడం గర్వకారణమన్నారు. టోర్నమెంట్లో కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ స్టూడెంట్స్‌ జట్టు కైవసం చేసుకోగా ఓవరాల్‌గా సమీనా స్టూడెంట్స్‌ పథకాలను సాధిం చారు. విజేతలకు ముఖ్య అతిథులు పథకాలతో పాటు బహుమతులను అందించి అభి నందించారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు దాదాపు 650మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ రెడ్డి నాయక్‌ రమేష్‌ టోర్నమెంట్‌ చైర్మన్‌ అమిత్‌ ఖాన్‌ అడ్వైజర్‌ అలిమ్‌ ఖాన్‌ సీనియర్‌ కరాటే మాస్టర్‌ నేరెళ్ల శ్రీధర్‌గౌడ్‌ మామిడాల సమ్మ య్య ఒరగంటి రామకృష్ణ కరీం నగర్‌ ఉష సెక్రెటరీ విద్యా సాగర్‌ కనకయ్య విక్రం బాలరాజు సంపత్‌ క్రీడాక ారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 01:01 AM