సాగు నీటి సంఘాలొస్తున్నాయ్..!
ABN, Publish Date - Jan 08 , 2025 | 01:32 AM
సాగునీటి సంఘాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల నేతృత్వంలోని బృందం ఇప్పటికే ప్రాథమిక నివేదకలను ప్రభుత్వానికి సమ ర్పించింది.
జగిత్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల నేతృత్వంలోని బృందం ఇప్పటికే ప్రాథమిక నివేదకలను ప్రభుత్వానికి సమ ర్పించింది. వీటిపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో సాగునీటి సంఘాల ఏర్పాటుపై అన్నదాతల్లో ఆసక్తి నెలకొంది. కాలువల మరమ్మతులు, నిర్వహణ పను ల్లో నిధుల వినియోగంలో అవినీతి, అక్రమాలకు ఆ స్కారం ఉండడంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న సా గునీటి సంఘాల మార్గదర్శకాలపై ప్రభుత్వం కసర త్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షే మ కమిషన్ కోరడంతో రాష్ట్రంలో మళ్లీ నీటి సంఘా లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాగు నీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరిం చడం వల్ల సాగునీటి వనరులను సక్రమంగా విని యోగించుకోగలుగుతామని వ్యవసాయ, రైతు సంక్షే మ కమిషన్ అభిప్రాయ పడింది. వాటి బాగోగులు ఎప్పటికప్పుడు చూడగలుగుతామని ప్రభుత్వానికి నివేదించింది.
ఇదీ పరిస్థితి...
సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి నీటి వనరు లను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు యాజమాన్య చట్టాన్ని 1996లో ప్రభుత్వం తీ సుకొచ్చింది. అందులో నీటి ప్రాజెక్టులకు నీటి విని యోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ప్రా జెక్టు కమిటీలు ఏర్పాటు చేసింది. అదే విధంగా చెరు వులకు సంఘాలను ఏర్పాటు చేశారు. వంద ఎకరా ల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు, కుంటలకు మాత్రం సాగు నీటి సంఘాలు ఏర్పాటు కాలేదు. సంఘాల ఎన్నికల విషయంలో రకరకాల పద్ధతులు అమలు చే శారు. 2010 లో నీటి సంఘాల ఎన్నికలు జరగాల్సి ఉ న్నప్పటికీ తెలంగాణ ఉద్యమం కారణంగా నిర్వహించ లేదు. అప్పటికే ఉన్న పాలక వర్గాలనే కొనసాగిస్తూ ప్రత్యేక జీవోలు తీసుకువచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వం పట్టించుకోలేదు. చెరువులను సా గునీటి సంఘాల ద్వారా కాకుండా మిషన్ కాకతీయ పేరుతో అధికారులతోనే అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్నారు. దీంతో సంఘాలు పూర్తిగా ఉనికిని కోల్పోయాయి.
జిల్లాలో 62 డిస్ట్రిబ్యూటరీ కాలువలు...
జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందు తోంది. ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు సు మారు 91 కిలో మీటర్ల మేర కాకతీయ కాలువ ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు విడుదల చేస్తున్న నీరు 25వ కిలో మీటరు వద్ద జిల్లాలో ప్రవహిస్తోంది. 116వ కిలో మీటరు వద్ద ముగుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు కాకతీయ కాలువకు అనుబందంగా ఉప కాలువలను ని ర్మించి నీరు సరాఫరా చేస్తున్నారు. జిల్లాలో డీ-21 ఉప కాలువ నుంచి డీ - 83ఏ వరకు దాదాపుగా 62 డిస్ట్రి బ్యూటర్ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రి బ్యూటరీకి ఆయకట్టును బట్టి ఎడమ, కుడి వైపులకు మరో 50 వరకు కాలు వలు ఉంటాయి. సంబంధిత కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు అందించాల్సి ఉంటుంది. జిల్లాలో దాదాపుగా ఎస్సారెస్పీ ద్వారా 1,68,255 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు సమీపంలో ఉండే చెరువులు, కుంట లు నింపేందుకు తూములు ఏర్పాటు చేయడం వల్ల సుమారు మరో లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు అందుతోంది. వీటికి తోడు జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, రోళ్లవాగు ప్రాజెక్టు, 35 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా సాగు నీరు అందిస్తున్నారు.
Updated Date - Jan 08 , 2025 | 01:32 AM