ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేములవాడకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Apr 01 , 2025 | 12:47 AM

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు సోమవారం పోటెత్తారు.

వేములవాడ కల్చరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు సోమవారం పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, ధర్మగుండంలో పవిత్ర స్నానాలను ఆచరించారు. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు కోడెమొక్కు క్యూలైన్‌లో సుమారుగా 5 గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి వేచి ఉండి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బ్రేక్‌దర్శనం క్యూలైన్‌లో సైతం భారీగా తరలిరావడంతో స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులు రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకుని అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మహిళ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవోలు అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆలయానికి చేరుకుని భక్తులకు సరైన దర్శనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని, స్థానికంగా ఉద్యోగులు లేకపోవడంతోనే పూర్తిస్థాయిలో భక్తులకు సరైన సేవలు అందించడంలో విఫలమవుతున్నారని ఆలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Apr 01 , 2025 | 12:47 AM