ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:38 AM

మల్లారెడ్డిపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారా యణగౌడ్‌ పేర్కొన్నారు.

ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి

గంభీరావుపేట, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మల్లారెడ్డిపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారా యణగౌడ్‌ పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో ఆంజనేయ స్వామిని ఆదివారం సత్యనారాయణగౌడ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కమలాకర్‌శర్మ, అజయ్‌శర్మ వీరికి వేదోక్త ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. నాగుల సత్యనారాయణగౌడ్‌ తక్షణ సహాయంలో బాగంగా ఆలయ అభివృద్ధికి 51వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణగౌడ్‌ మాట్లాడుతూ మల్లారెడ్డిపేట అంజన్న ఆల యం గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ దృష్టికి తీసుకెళ్లి ఆలయ అబివృద్దికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం ఆలయ కమిటీ తరపున జిల్లా గ్రంథాల య చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ను, తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్య క్షుడు సుధాకర్‌శర్మను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుధాకర్‌శర్మ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ అంజిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ మణిదీప్‌రెడ్డి, కాంగ్రెస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్‌రెడ్డితో పాటు గ్రామ స్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:38 AM