సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేయాలి

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:59 AM

సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు నిత్యం స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు.

సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేయాలి

సిరిసిల్ల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు నిత్యం స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. సిరిసిల్లకు చెందిన హెల్పింగ్‌ హార్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఆదివారం ఎమ్మెల్యే కాంపు కార్యాల యంలో ఆది శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. హెల్పింగ్‌ హార్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీని ఏర్పా టుచేసి 10 సంవత్సరాలు అయిందని, ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఎన్నో జీవితాల్లో స్వచ్ఛందంగా వెలుగులు నింపడం అభినందనీయన్నారు. హెల్పింగ్‌ హార్ట్స్‌ తమ సేవలను ఇలాగే కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సైకాలజిస్ట్‌ పున్నం చందర్‌, హెల్పింగ్‌ హార్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు అల్వాల ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి న్యాయవాది దాసరి తిరుమల, మాజీ కౌన్సిలర్‌ కుడిక్యాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:59 AM