ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యావరణహితంగా టీఎస్‌టీపీపీ..

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:16 AM

తెలం గాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీ పీ)ను పర్యావరణహితంగా నిర్మించామని ఎన్టీపీ సీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌వోపీ) చందన్‌ కుమార్‌ సామంత పేర్కొన్నారు.

జ్యోతినగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : తెలం గాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(టీఎస్‌టీపీ పీ)ను పర్యావరణహితంగా నిర్మించామని ఎన్టీపీ సీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌వోపీ) చందన్‌ కుమార్‌ సామంత పేర్కొన్నారు. శనివారం ఈడీసీ మిలీనియం హాలులో మీడియాతో ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో సీజీఎం మాట్లాడారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. టీఎస్‌టీపీపీని అత్యాధునిక అలా్ట్ర సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలతో నిర్మించామని, దీంతో తక్కువ నీరు, ఇంధనంతో ప్రాజెక్టు ఎక్కువ సామర్త్యంతో పని చేస్తుందన్నా రు. అలాగే తక్కువస్థాయిలో ఉద్ఘారాలు వెలువడు తాయని తెలిపారు. ప్రాజెక్టు నుంచి వెలువచే సల్ఫర్‌ డై యాక్సైడ్‌ను 98 శాతం నియంత్రించేం దుకు ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌(ఎఫ్‌జీడీ) వ్యవస్థ ను ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది సెపెటంబరు నుంచి ఎఫ్‌జీడీ పూర్తిస్థయిలో పని చేస్తున్నదన్నారు. త్వరలోనే టీఎస్‌టీపీపీ రెండో దశ(ఫేజ్‌ 2) నిర్మాణ పనులు ప్రారంభమవుతా యని తెలిపారు. నిర్మాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, 29,345 కోట్ల రూపాయల ప్రా జెక్టు వ్యయాన్ని ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపిం దన్నారు. ఈనెల 28న జరిగే ప్రజాభిప్రాయ సేక రణ తరువాత నిర్మాణ పనులు మొదలవుతాయ ని తెలిపారు. రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 5వేల మందికి ఉపాధి లభిస్తుందన్నా రు. అలాగే ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో మరో 176మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను విస్తరిస్తు న్నామని తెలిపారు. 56 మెగావాట్ల ఫ్లోటింగ్‌(నీటి లో తేలియాడే) సోలార్‌, 120 మెగావాట్ల సర్ఫేస్‌ సోలార్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఎస్‌టీపీపీ ఈ ఆర్థికసంవత్సరం డిసెం బరు వరి నాటికి 7.6 బిలియన్‌ యనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసిందన్నారు.ఒకేరోజు ప్రాజెక్టులో 37.377 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగినట్లు తెలిపా రు. ప్రాజెక్టులోని 800మెగావాట్ల యూనిట్‌-1 నిరంతరాయంగా 104రోజులు, యూనిట్‌-2 నిరం తరాయంగా 183రోజులపాటు విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు సీజీఎం చెప్పారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంటులో ఆర్‌అండ్‌ఎం పనులు పూర్తయ్యాయని, హెచ్‌ఎంఐ, డీఏఈటీపీ పీఎల్‌సీ, ఫ్లేమ్‌ స్కానర్‌ వ్యవస్థలను ఆధునికీకరించినట్లు చెప్పారు.

దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ అత్యుత్తమ ప్రాజెక్టు

దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ(2600మెగావా ట్లు)ప్రాజెక్టు అత్యుత్తమమైందని సీజీఎం చందన్‌ కుమార్‌ తెలిపారు. నాలుగున్నర దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలకు ఈప్రాజెక్టు నాణ్యమైన విద్యు త్‌ను అందిస్తోందని తెలిపారు. దక్షిణాదిలో అతి పెద్ద ప్రాజెక్టుగా రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు పొందిందన్నారు. సమావేశంలో జీఎంలు ఎ.కె. త్రిపాఠి, ఎ.ఆర్‌.డ్యాష్‌, సంపత్‌, సంతోష్‌ తివారి, కె.సి.సింగ రాయ్‌, ఎజీఎంలు విజయ్‌కుమార్‌ సిక్ద ర్‌, డి.ఎస్‌.రావత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:16 AM