ఈద్గాలో వసతులు కల్పించాలి

ABN, Publish Date - Mar 27 , 2025 | 01:06 AM

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరిం చుకొని పట్టణ శివారులోని ఈద్గాలో ప్రార్థనల కోసం వసతులను కల్పించాలని కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌ అధికారు లను ఆదేశించారు.

ఈద్గాలో వసతులు కల్పించాలి
ఈద్గాను పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌

-కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌

కోరుట్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరిం చుకొని పట్టణ శివారులోని ఈద్గాలో ప్రార్థనల కోసం వసతులను కల్పించాలని కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌ అధికారు లను ఆదేశించారు. ఈద్గాను బుధవారం మున్సిపల్‌ కమిషనర్‌ మారు తి ప్రసాద్‌ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. పట్టణ శివారులోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలోని ఈద్గాను పరిశీలించి పారిశుధ్య పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ క్రాంతి కుమార్‌, డీఈ సురేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:06 AM