ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్బన్‌ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలి

ABN, Publish Date - Apr 01 , 2025 | 11:43 PM

అర్బన్‌ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం సిబ్బందికి సూచించారు. త్రీ టౌన్‌, మానకొండూరు పోలీస్‌ స్టేషన్లను ఆయన మంగళవారం తనిఖీ చేశారు.

కరీంనగర్‌ త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ గౌస్‌ ఆలం

- సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అర్బన్‌ పోలీసింగ్‌పై దృష్టి పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం సిబ్బందికి సూచించారు. త్రీ టౌన్‌, మానకొండూరు పోలీస్‌ స్టేషన్లను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌ స్టేషన్లలో విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. సరైన పద్ధతిలో రికార్డులు నిర్వహించాలన్నారు. పెండింగ్‌ కేసులపై సమీక్ష చేశారు. మానకొండూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లుగా, సబ్‌ సెక్టార్లుగా విభజించి వాటికి గ్రామ పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. అన్ని రకాల విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జాన్‌రెడ్డి, మానకొండూరు ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:43 PM