కన్నులపండువగా గోదారంగనాథుల కల్యాణం
ABN, Publish Date - Jan 14 , 2025 | 01:21 AM
జిల్లా వ్యాప్తంగా గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్దఎత్తున్న హాజరయ్యారు.
జిల్లా వ్యాప్తంగా గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్దఎత్తున్న హాజరయ్యారు.
సుల్తానాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సుల్తానా బాద్ పట్టణంలోని ప్రసిద్ద పెరికె గిద్దె ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం గోదా రంగనాయకుల స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కొండపలుకల అభిలాష్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వర్‌రెడ్డి విజయలక్ష్మి, డైరెక్టర్ కత్తర్ల పోచమల్లు స్వరూప దంపతులు కల్యాణం నిర్వ హించారు. కార్యక్రమంలో మెంగని చంద్రశేఖర్ రాధ, గుబ్డే సంతోష్ రేణుక, కత్తెర్ల చందర్, సాదుల సుగుణా కర్, గొట్టం మహేష్ తదితరులు పాల్గొన్నారు. మండ లంలోని భూపతిపూర్‌లోగల వేంకటేశ్వర ఆలయంలో గోదారంగనాయకుల కల్యాణం నిర్వహించారు.
కాల్వశ్రీరాంపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామం లోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన గోదారంగనాథుల కల్యాణం సందర్భంగా మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాతరమేష్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ప్రజాప్రతినిధులు దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో గొడుగు రాజకొ మురయ్య, నక్కల కొమురయ్య, నాయకులు ఎండీ మునీర్, మాదాసి సతీష్, జంగ శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
జూలపల్లి: మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన గోదారంగనాథుల కల్యాణ మహో త్సవంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ దంపతులు, మాజీ సర్పంచ్ నర్సింహయాదవ్ దంపతు లు, నాయకులు మెండె రాజన్న, కొమ్మ ఐలయ్య, బండి స్వామి, మెరుగు రమేష్, భక్తులు పాల్గొన్నారు.
మార్కండేయకాలనీ: గోదావరిఖని బస్టాండ్ వద్ద ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, రఘుపతిరావున గర్‌లోని రంగనాథస్వామి ఆలయం, కాకతీయనగర్‌లోని భక్తాంజనేయస్వామి ఆలయంలో ఘనంగా గోదాదేవి రంగనాయక స్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంబటి సంతోష్, గోటికారి శ్రీనివాస్, పల్లెర్ల కృష్ణ, అయోధ్య రవీందర్, కోటేశ్వర్‌రావు, అచ్చెవేణు, నారాయణ, జేమ్స్ రెడ్డి, శ్రీధర్, మహేష్, నర్సింగారావు, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు: మండలంలోని ముప్పిరితోట గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన గోదారంగ నాయకుల కల్యాణమహోత్సవంలో అర్చకులు కొండపాక రమణచారి, గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
మంథని: సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రజలు భోగి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకున్నారు. అనంతరం ఇళ్లలో, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయ అవరణలో గోదారంగనాయకుల కల్యాణోత్సవాన్ని పండితులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. లక్ష్మీనారాయణస్వామి తోపాటు పట్టణంలోని పలు శివాలయాలు, అమ్మవారి ఆలయాలను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కమాన్‌పూర్: మండల కేంద్రంలోని వేణుగోపాలస్వా మి ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో సోమవారం గోదా రంగనాయకుల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు భక్తులకు అశీర్వాచనాలు అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు సముద్రాల వేణుగోపాలచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామానుజం సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Jan 14 , 2025 | 01:22 AM