ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోల్‌ ట్రాన్స్‌పోర్టులో గోల్‌మాల్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:33 AM

సింగరేణి నుంచి ఎన్‌టీపీసీకి బొగ్గు రవాణా చేసే ఓ కాంట్రాక్టర్‌ బొగ్గును కల్తీ చేసి రూ.10కోట్ల మేర అక్రమానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎన్‌టీపీసీకి పెద్ద నిఘా నేత్రాలు, పకడ్బందీ క్వాలిటీ కంట్రోల్‌ వ్యవస్థలున్నా అన్నింటి కళ్లుగప్పి కేవలం రెండు మాసాల్లోనే రూ.10కోట్లు దిగమింగాలని చూసిన కాంట్రాక్టర్‌ అవినీతిని ఎన్‌టీపీసీ పసిగట్టింది.

రాఘవాపూర్‌ రైల్వే సైడింగ్‌ వద్ద ఉన్న బొగ్గు డస్ట్‌

- రూ.10కోట్ల అవినీతికి తెరలేపిన కాంట్రాక్టర్‌

- రవాణా నిలిపివేసిన ఎన్‌టీపీసీ

గోదావరిఖని, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సింగరేణి నుంచి ఎన్‌టీపీసీకి బొగ్గు రవాణా చేసే ఓ కాంట్రాక్టర్‌ బొగ్గును కల్తీ చేసి రూ.10కోట్ల మేర అక్రమానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎన్‌టీపీసీకి పెద్ద నిఘా నేత్రాలు, పకడ్బందీ క్వాలిటీ కంట్రోల్‌ వ్యవస్థలున్నా అన్నింటి కళ్లుగప్పి కేవలం రెండు మాసాల్లోనే రూ.10కోట్లు దిగమింగాలని చూసిన కాంట్రాక్టర్‌ అవినీతిని ఎన్‌టీపీసీ పసిగట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎన్‌టీపీసీ కర్ణాటకలోని కుడిగి విద్యుత్‌ సంస్థ అవసరాల కోసం సింగరేణి నుంచి నాలుగు మాసాల క్రితం బొగ్గు కొనుగోలు చేసింది. సింగరేణి ఈ బొగ్గును జీడీకే 5ఓసీపీ, జీడీకే 11ఇంక్లైన్‌ నుంచి సరఫరాకు కేటాయించింది. సింగరేణి నుంచి జీ10, జీ11 గ్రేడ్‌ బొగ్గును కుడిగి ప్రాజెక్టుకు ఎన్‌టీపీసీ తీసుకెళ్లాల్సి ఉంది. ఈ బొగ్గు రవాణా కోసం ఎన్‌టీపీసీ నాలుగు మాసాల క్రితం ట్రాన్స్‌పోర్టు టెండర్‌ పిలిచింది. మహారాష్ట్రకు చెందిన ఒక కోల్‌ ట్రాన్స్‌పోర్టర్‌ ఈ టెండర్‌ దక్కించుకున్నాడు. 4లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయాల్సి ఉంది. బొగ్గు కేటాయించిన గనుల నుంచి రామగుండం సమీపంలోని రాఘవాపూర్‌ రైల్వే సైడింగ్‌ వరకు లారీల ద్వారా అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా కుడిగికి కాంట్రాక్టర్‌ బొగ్గు పంపించాడు. లారీల ద్వారా రాఘవాపూర్‌ రైల్వే సైడింగ్‌ సమీపంలో బొగ్గును పోగు చేసుకుని అక్కడి నుంచి ట్రైన్‌లో పంపిస్తారు. ఇక్కడే కాంట్రాక్టర్‌ తన అవినీతికి తెరలేపాడు. సింగరేణి నుంచి వెళ్లిన జీ10, జీ11 బొగ్గులో కోల్‌ యాష్‌, కోల్‌ బఠాని కలిపి ఎన్‌టీపీసీకి బొగ్గు రవాణా చేశాడు. ఇప్పటి వరకు 2లక్షల టన్నుల బొగ్గు సదరు కాంట్రాక్టర్‌ కర్ణాటక ఎన్‌టీపీసీ ప్లాంట్‌కు పంపించాడు. కుడిగి ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో ఏర్పడిన మార్పులను పరిశీలించిన ఎన్‌టీపీసీ క్వాలిటీ అధికారులు బొగ్గు కల్తీని గుర్తించారు. ఈ కాంట్రాక్టర్‌ ద్వారా సరఫరా అయ్యే బొగ్గును నెల రోజుల క్రితం నిలిపివేశారు. దీంతో ఈ బాగోతం వెలుగు చూసింది.

సింగరేణి జైపూర్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ తయారీకి బొగ్గును వాడిన తరువాత బొగ్గు కొంత బూడిద రూపంలో కొంత బఠానీ సైజులో మిగిలిన బయటకు వస్తుంది. ఈ బొగ్గును కూడా సింగరేణి ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అమ్ముతుంది. ఈ బొగ్గు రూ.600లకు టన్ను చొప్పున గోదావరిఖనికి చెందిన ఒక కాంట్రాక్టర్‌ టెండర్‌ తీసుకుని అమ్ముతున్నాడు. రూ.600లకు టన్ను చొప్పున దొరికే ఈ కోల్‌ బఠానిని కాంట్రాక్టర్‌ ఎన్‌టీపీసీకి బొగ్గు రవాణా చేసే బొగ్గులో కలిపి కర్ణాటకకు సరఫరా చేస్తున్నాడు. సింగరేణి నుంచి కొనుగోలు చేసే బొగ్గు ధర టన్నుకు రూ.3వేలు ఉంటుంది. కానీ రూ.600లకే దొరికే ఈ కోల్‌ బఠానిని అందులో కలిపి పంపిస్తున్నాడు. అంటే టన్నుకు రూ.2400 అక్రమంగా సంపాదించేందుకు కోల్‌ ట్రాన్స్‌పోర్టర్‌ తెరలేపాడు. ఇప్పటికి సరఫరా అయిన 2లక్షల టన్నులో సుమారు 40వేల టన్నులు నాసిరకం బొగ్గును కలిపి రవాణా చేసినట్టు తెలుస్తున్నది. బొగ్గు కల్తీ చేసి ఎన్‌టీపీసీకి పంపించడమే కాకుండా ఎన్‌టీపీసీ కోసం సింగరేణి నుంచి తెచ్చిన మేలు రకం బొగ్గును రాఘవాపూర్‌ నుంచే లారీల ద్వారా ప్రైవేట్‌గా అమ్ముకొని కూడా కాంట్రాక్టర్‌ సొమ్ముచేసుకునట్టు తెలుస్తున్నది. ఇదే రాఘవాపూర్‌ రైల్వే సైడింగ్‌ సమీపంలో ఒక ప్రైవేట్‌ బొగ్గు మాఫియా వేల టన్నుల నకిలీ బొగ్గును, బొగ్గు డస్టును, బొగ్గు బఠానీని కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటుంది. ఈ మాఫియా నుంచి కూడా సదరు కోల్‌ ట్రాన్స్‌పోర్టర్‌ వేల టన్నుల బొగ్గును కొనుగోలు చేసినట్టు తెలిసింది.

రామగుండం రైల్వే స్టేషన్‌లో కోల్‌ వ్యాగన్ల క్లీనింగ్‌ కోసం టెండర్లు పిలుస్తారు. గతంలో రూ.కోటికి ఉన్న టెండర్‌ ఇప్పుడు రూ.2 కోట్లకు పెంచి ఒక కాంట్రాక్టర్‌ తీసుకున్నాడు. రైల్వే వ్యాగన్లు శుభ్రం చేస్తున్నప్పుడు టన్నుల కొద్దీ బొగ్గు మిగులుతుంది. ఆ బొగ్గును పోగుచేసి అమ్ముకుంటున్న కాంట్రాక్టర్‌ కూడా ఈ బొగ్గు ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌కు వేల టన్నుల బొగ్గును సరఫరా చేసినట్టు సమాచారం. వ్యాగన్లను క్లీన్‌ చేసే కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్‌ కూడా రైల్వే అధికారులు, సిబ్బందిని మేనేజ్‌ చేసుకుని బొగ్గు సరఫరా ట్రైన్లను కొంత సేపు నిలుపుకుని టన్నుల కొద్ది బొగ్గును క్లీనింగ్‌ డస్ట్‌లో కలుపుకుని అమ్ముకుంటున్నట్టు పరిశీలనలో తేలినట్టు సమాచారం. మొత్తంగా సింగరేణి ప్రాంతంలోని రాఘవాపూర్‌, రెబ్బెన, రేచిని, మందమర్రి, బెల్లంపల్లి రైల్వే సైడింగ్‌ల్లో ఈ అక్రమ బొగ్గు దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ బొగ్గు రవాణాలో జరిగిన కల్తీపై ఎన్‌టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టర్‌పై చర్యలకు సిద్ధమైంది. రాఘావాపూర్‌ రైల్వే సైడింగ్‌ నుంచి వచ్చిన బొగ్గులో కల్తీ జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్‌టీపీసీ అధికారవర్గాలు తెలియజేశాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇక్కడి నుంచి సరఫరా అయ్యే బొగ్గు నిలిపివేయడంతో కుడిగి ఎన్‌టీపీసీ ప్రాజెక్టుకు అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నట్టు ఎన్‌టీపీసీ వర్గాలు తెలిపాయి. సింగరేణి యాజమాన్యం కూడా తమ మార్కెట్‌ను కాపాడుకునేందుకు బొగ్గు కల్తీపై దృష్టి సారించాల్సి ఉంది. సింగరేణి ప్రాంతంలోని రైల్వే సైడింగ్‌ల వద్ద కూడా సంస్థ ఎస్‌అండ్‌పీసీ, విజిలెన్స్‌ విభాగాలు బొగ్గు నాణ్యతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jan 11 , 2025 | 01:33 AM