హోలీ.. రంగలు కేళీ

ABN, Publish Date - Mar 15 , 2025 | 01:47 AM

జిల్లా వ్యాప్తంగా హోలీ పర్వ దినాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని వీధులన్నీ హరివిల్లులను తలపించాయి. మనుషులు, వాహనాలు, రహదారులు సైతం రంగుల మయమయ్యాయి. ఉదయం నుంచే ఉరకలేసిన ఉత్సాహంతో వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రంగులు తీసుకొని వీధుల్లోకి వచ్చారు. కుర్ర కారు హుషారుగా బైకులపై షికారు చేస్తూ రంగులను చల్లుకున్నారు.

హోలీ.. రంగలు కేళీ

- జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

సుభాష్‌నగర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా హోలీ పర్వ దినాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని వీధులన్నీ హరివిల్లులను తలపించాయి. మనుషులు, వాహనాలు, రహదారులు సైతం రంగుల మయమయ్యాయి. ఉదయం నుంచే ఉరకలేసిన ఉత్సాహంతో వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రంగులు తీసుకొని వీధుల్లోకి వచ్చారు. కుర్ర కారు హుషారుగా బైకులపై షికారు చేస్తూ రంగులను చల్లుకున్నారు.

ఫ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కార్యాలయం వద్ద.....

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ కార్యాలయం వద్ద హోలీ సంబరాలు నిర్వహించారు. పండగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బండి సంజయ్‌కుమార్‌ మాజీ మేయర్‌ వై సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వాసాల రమేశ్‌ నాయకులు, కార్యకర్తలతో కలసి హోలీ సంబరాలు జరుపుకున్నారు.

ఫ జిల్లా న్యాయస్థానం ఎదుట హజరైన న్యాయవాదులు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆడి పాడి నృత్యాలు చేశారు

ఫ టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో..

టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. టీఎన్జీవోస్‌ భవన్‌లో ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మెన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అందరూ రంగులు పూసుకుంటూ నృత్యాలు చేశారు. అనంతరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు మడిపెల్లి కాళీచరణ్‌, కార్యదర్శి అరవింద్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌, లక్ష్మీనర్సింహోరావు, సబిత, టీఎన్జీవోస్‌ కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్‌, గూడ ప్రభాకర్‌రెడ్డి, మహిళ జేఏసీ చైర్మెన్‌ శారద, సబిత, సునీత, సరిత, విజయలక్ష్మి, శైలజ, రాధిక, జమున, రాజేశ్వర్‌రావు, సర్దార్‌ హర్మిందర్‌సింగ్‌, కేశవరెడ్డి, అభిషేక్‌రెడ్డి, మహేశ్‌, అజయ్‌, నారాయణ, అల్లె శ్రీనివాస్‌, కాంతయ్య పాల్గొన్నారు.

- కరీంనగర్‌ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ ఎనమల్ల నరేష్‌ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు పాల్గొని రంగులు చల్లుకున్నారు. డాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.

- మేముసైతం యువసేన ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులతో కలిసి వారు పండగ సంబరాలు జరుపుకున్నారు. వారికి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షురాలు చకిలం స్వప్న, శ్రీనివాస్‌, విక్రమ్‌, హనురూప్‌ పాల్గొన్నారు.

- పద్మనాయక హాస్టల్‌లో, వాకర్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. సిక్‌వాడీలో సిక్కులు ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. టవర్‌సర్కిల్‌లో విశ్వబ్రాహ్మణ యూత్‌ ఆద్వర్యంలో హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ సంబరాల్లో పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2025 | 01:47 AM