Karimnagar: పాలకుల నిర్లక్ష్య వైఖరి, అహంకార దోరణితో ప్రజల ఇబ్బందులు

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:48 PM

సుభాష్‌నగర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారని, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారని

 Karimnagar:  పాలకుల నిర్లక్ష్య వైఖరి, అహంకార దోరణితో ప్రజల ఇబ్బందులు

- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌

సుభాష్‌నగర్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అష్టకష్టాల్లో ఉన్నారని, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారని పాలకుల నిర్లక్ష్యవైఖరి దోరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన హోళీ వేడుకల్లో పాల్గొని పార్టీశ్రేణులు, అభిమానులతో కలిసి నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పాలకుల అహంకార ధోరణి, అబద్ధాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీయే ప్రధాన ప్రతిపక్షమని ప్రజలు గుర్తించారు కాబట్టేవిజయం చేకూర్చి పెట్టారని అన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, ఇది మోదీ చరిష్మా అని అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలు, సమాజం కలిసి మెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ వై సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వాసాల రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:55 PM