వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:55 AM
ఆరోగ్య కేంద్రంలో అందిస్తు న్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

ముస్తాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య కేంద్రంలో అందిస్తు న్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతిగృహాన్ని, వ్యవసాయ మార్కెట్‌యార్డు గోదాంను, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలో షెడ్యుల్డ్ కులా ల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతిగృహాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వసతిగృహంలో ఎంతమంది ఉంటారు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఉన్నత శిఖరాలను అధిరోహించు కోవడానికి చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. వసతిగృహంలో స్టోర్‌రూం, వంటగది, డార్మెటరీలను కలెక్టర్ పరిశీలిం చారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరాతీశారు. ఈ కార్య క్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బత్తుల గీతాంజలి, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:55 AM