ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఎల్లంపల్లి’ భూముల కబ్జాపై కదులుతున్న డొంక..

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:31 AM

ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల కబ్జా వ్యవహారంలో డొంక కదులుతోంది. గతనెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఎల్లంపల్లి భూముల కబ్జా’ కథనంపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టిన జాయింట్‌ సర్వే పూర్తి కావచ్చింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల కబ్జా వ్యవహారంలో డొంక కదులుతోంది. గతనెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఎల్లంపల్లి భూముల కబ్జా’ కథనంపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టిన జాయింట్‌ సర్వే పూర్తి కావచ్చింది. ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌లోని భూములను కబ్జా చేసి అడ్డుగా కట్టలు వేసి చెరువులను నిర్మించి చేపలు పెంచుతున్నది నిజమేనని సర్వేలో తేటతెల్లం అయ్యినట్లు సమాచారం. దాదాపు వంద ఎకరాలకు పైగా అక్రమార్కులు ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌ భూములను ఆక్రమించి చేపల చెరువులు చేపట్టినట్లు సర్వేలో తేలిందని తెలిసింది. ఎఫ్‌టీఎల్‌ వరకు హద్దురాళ్లు పాతగా వంద ఎకరాలకు పైగా ప్రాజెక్టు భూములు కబ్జా చేశారని తెలుస్తున్నది. ఈ చేపల చెరువులను ఐదేళ్ల క్రితమే తవ్వి అక్రమార్కులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం నీటి పారుదల శాఖాధికారులకు తెలియకుండానే జరుగుతున్నదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమార్కులు ఆయా శాఖల అధికారులను మచ్చిక చేసుకునే దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలోని అంతర్గాం మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో పొట్యాల నుంచి ముర్మూర్‌ వరకు సోమనపల్లి కేంద్రంగా వంద ఎకరాలకు పైగా చేపల చెరువులను నిర్మించారు. పొట్యాల, సోమనపల్లి, అకెనపల్లి, ముర్మూర్‌ రెవెన్యూ శివారుల్లోని శ్రీపాద ప్రాజెక్టు భూముల్లో ఈ దందా కొనసాగుతున్నది. అక్రమ దారులు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాన్ని కబ్జా చేసి పెద్దగా మట్టి కట్టలు పోసి 30 నుంచి 40 చెరువులను నిర్మించి ప్రాజెక్టు నుంచి పైపులైన్లు వేసి అక్రమంగా నీళ్లు వాడుకోవడంతో పాటు కరెంట్‌ను కూడా వాడుకుంటున్నారు. అక్రమార్కులు కొంత పట్టా భూములను స్థానికుల నుంచి లీజుకు తీసుకుని ఎక్కువ మొత్తంలో ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను కబ్జా చేసి దర్జాగా చేపల వ్యాపారం చేపట్టారు. ప్రతి ఏటా 50 నుంచి 100 కోట్ల రూపాయల టర్నోవర్‌ గల వ్యాపారం చేసి కోట్లు గడించినట్లు సమాచారం.

ఫ అధికారుల తీరుపై అనుమానాలు

ప్రాజెక్టు బ్కాక్‌ వాటర్‌ భూములను కబ్జా చేసి చెరువులు తవ్వి వ్యాపారం చేస్తున్న వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష స్పందించి జాయింట్‌ సర్వేకు ఆదేశించారు. వారం రోజుల నుంచి అంతర్గాం మండల తహసీల్దార్‌ తూము రవీందర్‌, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు డీఈఈ బుచ్చిబాబు, సర్వేయర్‌, తదితరులు జాయింట్‌ సర్వే చేపట్టారు. ఈ సర్వే కోసం అధికారులు పోలీస్‌ ప్రొటెక్షన్‌ తీసుకుని సర్వే చేశారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను గుర్తించిన అధికారులు 30 చేపల చెరువులను కొంత పట్టా భూములను కలుపుకుని ఎక్కువగా ప్రాజెక్టు భూముల్లోనే నిర్మించినట్లు గుర్తించారు. నీళ్లు ఉండడం వల్ల ఎంత విస్తీర్ణంలో ప్రాజెక్టు భూములను కబ్జా అయ్యింది తేల్చలేకపోతున్నారు. దాదాపు 100 ఎకరాలకు పైగానే భూములను కబ్జా చేసినట్లు గుర్తించారని సమాచారం. ఈ భూములను ఎవరెవరు కబ్జా చేసి అక్రమంగా చేపల వ్యాపారం చేస్తున్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు నీటి పారుదల శాఖాధికారులు సిద్ధం అవుతున్నారు. ఇదివరకే పిర్యాదు చేసినప్పటికీ, పూర్తి వివరాలతో అక్రమార్కులపై మరొక ఫిర్యాదు చేస్తామని ప్రాజెక్టు ఈఈ స్వామి ‘ఆంరఽధజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు అక్రమార్కులు అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులతో పైరవీలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ అక్రమ దందాకు నీటి పారుదల శాఖాధికారుల ప్రమేయం ఉండిం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సదరు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం వల్లనే అక్రమార్కులు ప్రాజెక్టు భూములను ఆక్రమించి, నీళ్లు, విద్యుత్‌ను అక్రమంగా వాడుకుని దర్జాగా వ్యాపారం కొనసాగించినట్లు తెలుస్తున్నది. దీనికి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 01:31 AM