ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:17 AM
ప్రజాసంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు.
అంతర్గాం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు అనుబంధంగా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా 108ను ప్రారంభించి మాట్లాడారు. మండల పరిధిలోని 16గ్రా మాల ప్రజ లు 108సేవలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో 18 మంది కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, జిల్లా వైద్యాధి కారి అన్న ప్రసన్న కుమారి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉదయ్ కిరణ్, కాంగ్రెస్ నాయకులు పెండ్యాల మహేష్, మడ్డి తిరుపతి గౌడ్, పేండ్రు హనుమాన్‌రెడ్డి, పూదరి సత్త్తయ్యగౌడ్, ఆవుల గోపాల్ యాదవ్, పానగం టి సత్తయ్య, జూల లింగయ్య, బరుపటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 01:17 AM