ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రామగుండాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా..

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:13 AM

కోల్‌బెల్ట్‌లో అన్ని ప్రాంతాల కంటే రామగుండాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూ ర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు.

గోదావరిఖని, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కోల్‌బెల్ట్‌లో అన్ని ప్రాంతాల కంటే రామగుండాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూ ర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. శనివారం చౌరస్తా సమీపంలోని గాంధీ మార్కెట్‌లో రూ.24కోట్లతో నిర్మించబోయే షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనానికి రాజ్‌ఠాకూర్‌ భూమి పూజ చేశారు. మరో రూ.15కోట్లతో జరగబోయే అభివృద్ధి పనులను సైతం ప్రారం భించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి నిధులతో ఈ పనుల న్నీ జరుగనున్నాయని, సింగరేణి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు కొనసా గిస్తామన్నారు. పట్టణ అభివృద్ధి, నగర సుందరీకరణలో భాగంగా ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. ఏడాదిలోపు షాపింగ్‌ కాంప్లెక్స్‌ పూర్తిచేయిస్తామ న్నారు. రామగుండం అభివృద్ధి సహకరిస్తున్న సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలి పారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు, ప్రజలకు కనీస మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేస్తామన్నారు. చిరు వ్యాపారులు తాత్కాలికంగా ఇబ్బంది పడి నప్పటికీ శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా ప్రణాళికలు చేపడుతున్నట్టు చెప్పారు. రూ.15కోట్ల వ్యయంతో సుమారు 344రూములను నిర్మించేందుకు సింగ రేణి ముందుకు వచ్చిందని, ఇవన్నింటిని అర్హులైన వారికి అందిస్తామన్నారు. ఈ అభివృద్ధితో గోదావరిఖని ఒక కొత్త రూపును సంతరించుకుంటుందన్నారు. బండ లవాగు ప్రాజెక్టు పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు. ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌, ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్‌, మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని, కొలిపాక సుజాత, దుబాసి లలిత, ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ ఆరెల్లి పోషం, కాంగ్రెస్‌ నాయకులు పాత పెల్లి ఎల్లయ్య, ఎస్‌ఓటూ జీఎం రాంమోహన్‌, డీజీఎం(పర్సనల్‌) కిరణ్‌బాబు, అధికారులు డీవీరావు, ఆంజనేయప్రసాద్‌, హన్మంతరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:13 AM