ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసర ప్రాంతాలపై ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నిర్లక్ష్యం..

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:12 AM

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజ మాన్యం ప్రభావిత, పరిసర ప్రాంతాలపై నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తోందని, స్థానికులకు ఉపాధి కల్పించడం లేదంటూర ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోల్‌సిటీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజ మాన్యం ప్రభావిత, పరిసర ప్రాంతాలపై నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తోందని, స్థానికులకు ఉపాధి కల్పించడం లేదంటూర ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో అలోక్‌ సంఘాల్‌తో ఫ్‌సీఎల్‌ గెస్ట్‌హౌస్‌ లో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎఫ్‌సీఐని పునరు ద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిశ్ర మల వల్ల వీర్లపల్లి శబ్ద, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడు తుందని, వెంటనే ఆ గ్రామాన్ని తరలించి పునరావాసం కల్పించాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి వెలువడే అమ్మోని యాతో గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌, తిలక్‌నగర్‌, చంద్రశేఖర్‌ నగర్‌, శాంతినగర్‌, లక్ష్మీపురం ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాయని, నీటిని శుద్ధి చేయకుండానే కాలుష్య జలాలను డ్రైన్లలోకి, గోదావరిలోకి వదులుతున్నారన్నారు. జెడ్‌ఎల్‌డీ నిర్మాణం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇన్నాళ్లు రైతాంగాన్ని దృషిలో ఉంచు కుని పరిశ్రమకు సహకరించామని, కానీ యాజమాన్యం పరిసర ప్రాంతాలు, ప్రభావితాలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇది గర్హనీయమ ని, వైఖరి మారకపోతే తిరుగబడుతామన్నారు. స్థానికులకు ఉపాధి కల్పించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గతంలో హమాలీ పనులను అమ్ముకునేందుకు సహకరించి కార్మికుల ప్రాణా లు పోయేలా చేశారని, ఇప్పుడు ప్రభావిత గ్రామాలైన ఎల్కలపల్లి వారికి పనులు ఇవ్వమంటే కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పరిసర గ్రామాలు, డివిజన్లలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా కల్పించాల్సిన బాధ్యత సంస్థపై ఉందన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియాకు విని యోగిస్తున్న బ్యాగులను గుజరాత్‌ నుంచి తెప్పిస్తున్నారని, స్థానికంగా తీసుకునేలా చర్యలు చేపట్టాలని, తద్వారా అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. స్థానిక లారీలకు లోడింగ్‌లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లోడింగ్‌లు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ అనీల్‌ కుమార్‌, ఏసీపీ మడత రమేష్‌, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ డీజీఎం(హెచ్‌ఆర్‌) సోమనాథ్‌, అధికారులు అజయ్‌, మయాంక్‌, కార్పొరేటర్‌ బాల రాజ్‌కుమార్‌, దీటి బాలరాజు, కొక్కిరాల శ్రీనివాసరావు, పాండు రంగారావు, లారీ యజమానుల సంఘం అధ్య క్షుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:12 AM