ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు..

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:08 AM

రాష్ట్రంలో స్వ శక్తి మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సో లార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధ న శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

పెద్దపల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్వ శక్తి మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సో లార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధ న శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఉపముఖ్యమంత్రి ప్రజా భవన్‌ నుంచి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సి పల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లోకేష్‌, సెర్ఫ్‌సీఈ వో దివ్యదేవరాజన్‌, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌తో కలిసి మహిళా సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ప్లాం ట్‌ ఏర్పాటుపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ కాన్ఫరెన్ఫ్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవ కాశాలు ఏర్పడతాయన్నారు. రానున్న కొత్త విద్యుత్‌ పాలసీ నేపథ్యంలో ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్‌ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముం దుకువెళ్లాలని సూచించారు. ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దా లని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో మహిళలకు పెద్దఎత్తున వడ్డీలేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నామని, వారు వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి వస తులు కల్పించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు సోలార్‌ పవర్‌ప్లాంట్‌ల ఏర్పాటుకు వారికి అందుబా టులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్ల ను ఆదేశించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్‌లో ఏర్పాటుకు విద్యుత్‌ శాఖ రెడ్కో ద్వారా టెం డర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్‌ చేసి వాటిని ఖరారుచేస్తారని వెల్లడించారు. జిల్లాల్లో ఆసక్తి గల మహిళా సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూసేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, కలెక్టర్లు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక మెగావాట్‌ ఉత్ప త్తికి నాలుగు ఎకరాలు అవస రం ఉంటుందని, ప్రతి జిల్లాలో 150ఎకరాలకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల ఎకరాలు సేకరించాల్సి ఉం టుందన్నారు. దేవాదాయ, ఇరి గేషన్‌ శాఖల పరిధిలోని భూ ములను గుర్తించాలని, కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధిచేసుకునే అవకాశం ఏర్ప డిందన్నారు. అటవీప్రాంతాల్లో భూములపై హక్కులు ఏర్పడినప్పటికీ స్తంభాలు వేసి విద్యుత్‌ లైన్‌ల ద్వారా విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుచేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సోలార్‌ పవర్‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. ప్రధానమంత్రి కుసుమ్‌ పథకంలో భాగంగా రైతులు రెండు మెగావా ట్ల వరకు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడిందని, ఈదిశగా రైతులను చైతన్యపరచాలన్నా రు. తెలంగాణ రెడ్కో పోర్టల్‌ ద్వారా రైతులు సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని, దీనిద్వారా తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో ఎం కాళిందిని, జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:08 AM