మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:46 PM
మంచినీటి సరఫరాపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): మంచినీటి సరఫరాపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యలు మంచినీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ, బయో గ్యాస్ ప్లాంట్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, టెండర్ ప్రక్రియ చేపట్టాలన్నారు. డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపునకు చర్యలు చేపట్టాలని, వెంటనే డీసిల్టింగ్ ప్రక్రియకు టెండర్లు పిలవాలన్నారు. సమావేశంలో ఈఈలు యాదగిరి, సంజీవ్, డీఈలు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, ఏఈలు సతీష్, గట్టు స్వామి పాల్గొన్నారు.