ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ పట్టాలపై ఉక్కుపాదం

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:33 AM

అసైన్డ్‌ భూముల అక్రమ పట్టాలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. పలుకుబడి భూ కబ్జాల నిగ్గు తేల్చేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అసైన్డ్‌ భూముల అక్రమ పట్టాలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. పలుకుబడి భూ కబ్జాల నిగ్గు తేల్చేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారు. సంక్షేమ పథకాలను సైతం సద్వినియోగం చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వ చర్యలతో అక్రమంగా పట్టా చేసుకున్నవారిలో భయం మొదలైంది. జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, గంభీరావుపేట, ముస్తాబాద్‌, మండలాల్లో అసైన్డ్‌ భూములు భారీగా చేతులు మారాయనే దానిపై పరిశీలన మొదలైంది. ఇప్పటికే సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌, పెద్దూర్‌, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌, తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌, గోపాల్‌రావుపల్లె, తాడూరు, అంకుసాపూర్‌, పాపయ్యపల్లి, సారంపల్లి, మండెపల్లి, ఓబులాపూర్‌, గ్రామాల పరిధిలో అసైన్డ్‌ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయని గుర్తించారు. పలువురిని అరెస్ట్‌ చేయడంతో కలకలం మొదలైంది. ఈ ప్రాంతాల్లో ఎకరం భూమి రూ 25 లక్షల నుంచి రూ 50 లక్షల వరకు ధర పలుకుతుంది. తంగళ్లపల్లి మండలంలోనే 69 ఎకరాలకు సంబంధించిన వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రస్థుత ఎమ్మెల్యే అప్పటి మంత్రి కే తారకరామారావు, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు హయాంలో భూముల కేటాయింపులపై ఆరా తీస్తున్నారు. అసైన్డ్‌ భూములపై అప్పటి అధికారుల్లోనూ భయం మొదలైంది. కబ్జాదారులు, అక్రమంగా పట్టాలు పొందిన వారు అరెస్టుకు గురవుతున్నారు. గతంలో ప్రధానంగా బీఆర్‌ఎస్‌ నాయకులే పట్టాలు పొందినట్లుగా తెలుస్తోంది. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా నేతృత్వంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరుపుతున్న నేపఽథ్యంలో సర్కారు భూముల అక్రమాలు వెలుగులోకి వస్తున్నట్లు భావిస్తున్నారు.

లక్షల్లో చేతులు మారాయా?

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో విలువైన అసైన్డ్‌ భూములు, లావని, ఆటవీ భూములు పట్టాలుగా మారే క్రమంలో లక్షల రూపాయలు చేతులు మారాయా? అనే అనుమానాలు బల పడుతున్నాయి. జిల్లాలో కోట్ల విలువ చేసే 500 ఎకరాల భూములు పట్టాలుగా మారినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భూ ప్రక్షాళనలో భాగంగా ఎల్‌ఆర్‌యూపీ సర్వేలోనే బీఆర్‌ఎస్‌ నేతలు అసైన్డ్‌ భూములు, లావని భూములపై పట్టాదారు పుస్తకాలు పొందినట్లు తెలుస్తోంది. అప్పటి అధికారులు నిబంధనలు పాటించకుండా కబ్జాదారులతో చేతులు కలిపారనే అరోపణలు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ కలెక్టర్‌కు అదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది.

భూములు వాపస్‌

జిల్లాలో అసైన్డ్‌ భూములకు అక్రమంగా పట్టాలు పొందిన వారు తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకొస్తున్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన మాజీ ఉపసర్పంచ్‌ కుమారస్వామి గతంలో మూడెకరాలు కబ్జా చేసి సాగులో ఉన్నాడు. భూ వ్యవహారాల నేపథ్యంలో 464 సర్వే నంబరులోని మూడెకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు మంగళవారం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సమక్షంలో లిఖిత పూర్వకంగా లేఖను అందించాడు. లక్ష్మీపూర్‌ మాజీ సర్పంచ్‌ మిట్టపల్లి పద్మ తాడూర్‌ శివారులో సర్వే నంబరు 545లో రెండెకరాల అసైన్డ్‌ భూమిపై పట్టాను పొందారు. డిసెంబరు 30న పట్టాను తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. ఇదే వరుసలో జిల్లాలో పట్టాలు పొందిన వారు కబ్జాలో భూములు ఉంచుకున్నవారు సైతం తిరిగి అప్పగించడానికి ముందుకొస్తున్నారు.

అరెస్టుల కలకలం

జిల్లాలో అసైన్డ్‌ భూముల అక్రమ పట్టాలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతుండడం కలకం రేపింది. మంగళవారం తంగళ్లపల్లి మండలం సింగిల్‌ విండో చైర్మన్‌ కోడూరి భాస్కర్‌గౌడ్‌ను రిమాండ్‌కు పంపారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో సర్వే నంబరు 365లో 20 గుంటలు భూమిపై అక్రమంగా పట్టా పొందినట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. గతంలో భూ ఆక్రమణల్లో పట్టాలు పొంది రద్దు చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. గత నెలలో నలుగురు బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్ట్‌ చేశారు.

అధికారుల్లో గుబులు

గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట, వీర్నపల్లి, మండలాల్లో అక్రమ పట్టాలకు పలుకుబడి నాయకులతో కలిసి పనిచేసిన అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. అక్రమంగా పట్టాలు పొందిన వారిని రిమాండ్‌కు పంపుతున్న కేసుల్లో అప్పటి తహసీల్దార్‌లు, ఆర్‌ఐ, వీఆర్వోలపై కేసులు నమోదు చేస్తుండడంతో ఎవరు జైళ్లకు వెళ్లాల్సి వస్తుందోననే అందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూ కబ్జాలకు సంబంధించిన ఎన్‌వోసీలు జారీ చేసిన వారిపై సైతం ఇబ్బందులు తప్పవని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

పేదల సంక్షేమానికి వినియోగిస్తాం

- జిల్లా కలెక్లర్‌ సందీప్‌కుమార్‌ ఝా

జిల్లాలో ఎవరైనా భూ అక్రమణలకు పాల్పడి ఉంటే భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛంధంగా అప్పగించాలని అ భూములను పేదల ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు వినియోగిస్తామని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో తంగళ్లపల్లి మండలం సారంపల్లి కి చెందిన సుంచుల కుమారస్వామి సర్వే నెంబర్‌ 464లో మూడెకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకన్న దానిని తిరిగి జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌ సమక్షంలో అప్పగించారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ కుమార స్వామి మూడెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించాడని తెలిపారు. జిల్లాలో ఎవరైనా భూ అక్రమణలకు పాల్పడి ఉంటే స్వచ్ఛంధంగా అప్పగించాలని అన్నారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి అక్రమణల్లో రైతు బంధు, పీఎం కిసాన్‌ మొదలైనా ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ధి పొందిన సోమ్మును రికవరీ కోసం డిమాండ్‌ నోటీస్‌ జారీ చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 250 ఎకరాల ప్రభుత్వ భూమని స్వాధీనం చేసుకన్నారని హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2025 | 01:33 AM