ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహకార సంఘాల బలోపేతం

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:31 AM

వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపే తానికి కేంద్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తృతంగా సేవలందిస్తున్నాయి. గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల కోడ్‌తో ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా వ్యవసాయ సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేయాలని, ప్రతీ మండలానికి రెండు ఉండాలని సూచనలు చేసిన క్రమంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

- పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

- గతేడాది సింగిల్‌ విండోల పెంపుపై నిర్ణయం

- ప్రతీ మండలానికి రెండు పరపతి సంఘాలు

- జిల్లాలో 2019లో కొత్తగా 5 సింగిల్‌విండోల ఏర్పాటుకు ప్రతిపాదనలు

- తాజాగా 8 సంఘాల వరకు పెరిగే అవకాశం

- జిల్లాలో 24 సహకార సంఘాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపే తానికి కేంద్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తృతంగా సేవలందిస్తున్నాయి. గత సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల కోడ్‌తో ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా వ్యవసాయ సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేయాలని, ప్రతీ మండలానికి రెండు ఉండాలని సూచనలు చేసిన క్రమంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం ఉన్న 24 సహకార సంఘాలను పెంచే దిశగా పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది సింగిల్‌ విండోలు కొత్తగా పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. దీనికి తోడుగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు కోరినా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఐదు వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పంపిన ప్రతిపాదనలకు ఈ సంవత్సరమైనా మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మండలానికో రెండు సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు 25 రకాల సేవలు అందించాలని నిర్ణయించింది.

జిల్లాలో పెరుగనున్న పరపతి సంఘాలు

జిల్లాలో గత సంవత్సరం మేలో కేంద్రమంత్రి మండలి నిర్ణయం మేరకైనా అన్నదాతలకు పరపతి సంఘాలు పెరుగుతాయని భావించినా ప్రతిపాదనలో అగిపోయాయి. జిల్లాలో ప్రస్తుతం 24 సహకార సంఘాలు ఉండగా 74,728 మంది సభ్యులు ఉన్నారు. ఓటుహక్కు కలిగిన వారు 35,776 మంది ఉన్నారు. గత ప్రభుత్వం మండలానికి రెండు సంఘాలు ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలో 13 మండలాలు ఉండగా 24 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా తంగళ్లపల్లి, మర్రిపల్లి, వట్టెంల, వీర్నపల్లి, గర్జనపల్లి, రుద్రంగి సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు గతంలో పంపించారు. కొత్త సంఘాలు ఏర్పడిన తర్వాత సింగిల్‌విండో ఎన్నికలు నిర్వహిస్తారని భావించిన కొత్త సంఘాలు ఏర్పడకముందే ఎన్నికల నిర్వహణ పూర్తి చేశారు. కొత్త సంఘాల ప్రతిపాదనలు మూలన పడ్డాయి. కేంద్రప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు నిర్ణయించడంతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్ర సహకార బ్యాంక్‌సేవలను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనకూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ రూరల్‌ మండలాలతోపాటు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల మేరకు ఎనిమిది సింగిల్‌ విండోలు పెరుగుతాయని భావిస్తున్నారు. రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీకి సింగిల్‌ విండోలు తోడ్పడుతున్నాయి. వీటిని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం భావించినా ఫలితాలు నామమాత్రంగానే మారాయి. ఈ సారైనా సింగిల్‌ విండోలు బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.

సొసైటీల్లో 74,728 మంది సభ్యులు

జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో 74,728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12,859 మంది సభ్యులు ఉండగా పెద్దూరు సొసైటీలో 1336 మంది, నేరెళ్ల సొసైటీలో 1257, కోనరావుపేట సొసైటీలో 6196, కొలనూరు సొసైటీలో 3018, వేములవాడ సొసైటీలో 8180, నాంపెల్లి సొసైటీలో 1191, రుద్రవరం సొసైటీలో 998, చందుర్తి సొసైటీలో 3369 మంది, సనుగుల సొసైటీలో 1733, బోయినపల్లి సొసైటీలో 910, కోరెం సొసైటీలో 1694, మాన్వాడ సొసైటీలో 1163, నర్సింగాపూర్‌ సొసైటీలో 1684, ఇల్లంతకుంట సొసైటీలో 3547, గాలిపెల్లి సొసైటీలో 1680, ముస్తాబాద్‌ సొసైటీలో 2082, పోత్గల్‌ సొసైటీలో 7169, గంభీరావుపేట సొసైటీలో 8183, కొత్తపెల్లి సొసైటీలో 3680, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3864, అల్మాస్‌పూర్‌ సొసైటీలో 2139, తిమ్మాపూర్‌ సొసైటీలో 1597, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 01:31 AM