పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Apr 03 , 2025 | 01:36 AM

మల్యాల, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేప ట్టిందన్నారు. ముఖ్యమంత్రులు, అధికారు లు ఏ బియ్యం తింటారో అవే బియ్యం పేదలకు అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మల్యాల మండలం నూకపల్లిలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సత్యం

దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ

మల్యాల, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేప ట్టిందన్నారు. ముఖ్యమంత్రులు, అధికారు లు ఏ బియ్యం తింటారో అవే బియ్యం పేదలకు అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మండలం లోని నూకపల్లిలో బుధవారం అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతతో కలసి ఎమ్మెల్యే రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ స్వరాష్ట్రం లోనూ పేదలకు సన్నబియ్యం ఇవ్వడం లేదని విమర్శించారు. పదేళ్లు పరిపాలిం చిన మాజీ సీఎం కేసీఆర్‌కు సన్న బియ్యం అందించాలనే అలోచనే రాలేదన్నారు. రూ పాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రజలకు సన్నబియ్యం, ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయా ణం, ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించిం దని తెలిపారు. అనంతరం 36మందికి రూ.10.96లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు. 100మంది యువకులకు హెల్మెట్లను సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌ కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు. మద్టు ట్లలో నూతన బోర్‌వెల్‌ను ప్రారంభించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్‌సప్ల యిస్‌ అధికారి మనోజ్‌, ఆర్డీవో మధుసూఽ దన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ బత్తిని మల్లేశ్వరి, తహసీల్దార్‌ మునీందర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:36 AM