ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రామగిరి ఖిల్లాకు ‘పర్యాటక’ సొబగులు

ABN, Publish Date - Jan 13 , 2025 | 01:55 AM

జిల్లాలోని చారిత్రక రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. ఖిల్లాను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా ఇటీవల ప్రభుత్వం రూ.5 మంజూరుచేసింది.

- పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు

- మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ప్రణాళికలు

- త్వరలో పనులు చేపట్టనున్న అధికారులు

మంథని/రామగిరి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చారిత్రక రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. ఖిల్లాను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా ఇటీవల ప్రభుత్వం రూ.5 మంజూరుచేసింది. అనేక ప్రత్యేక తలు, ప్రాధాన్యం సంతరించుకున్న రామగిరి ఖిల్లాను పర్యా టక కేంద్రంగా మార్చడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రణాళికలు రూపొం దించారు. ప్రకృతి అందాలకు, శిల్పకళా సంపదకు, ప్రాచీన సంస్కృతికి, చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలం రామగిరి ఖిల్ల్లా. వందల సంవత్సరాలపాటు వివిధ వంశా లకు చెందిన రాజులకు శత్రు దుర్భేద్యమైన రక్షణ స్థావ రంగా ఈ దుర్గం ఆశ్రయమిచ్చింది. అలాంటి రామగిరి ఖిల్లా వైభవం కాలక్రమేణా కనుమరుగవుతూ వచ్చింది. నాటి కమాన్‌పూర్‌ నేటి మండలం బేగంపేట గ్రామానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎత్తైన గుట్ట మీద క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రామగిరి ఖిల్లా రూపుదిద్దుకున్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఎంతో ఎత్తుగల దుర్గం అనే రాతి కట్టడాలతో, బురుజులతో, ఫీనాలతో విరాజిల్లుతోంది. తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్ఠంగా ఉండి వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. పురావస్తు శాఖ దీనిని వెలుగులోకి తీసుకు రాకపోవడంతో ఇది ఎవరి దృష్టికి రాక, అడవిలో ఓ మూలన పడిఉంది. రామగిరి ప్రాంతంలో జన జీవనం సాగించినట్టు ఆధారాలు ఉన్నాయి. అనేక కట్టడాలు భూగర్భంలో కలిసినట్లు ఇక్కడివారు చెబుతారు.

ఫ ఖిల్లాపై పర్యాటక శాఖ చేపట్టే అభివృద్ధి పనులు ఇవే..

ఖిల్లా సమీపంలో పార్కింగ్‌ ఏరియా అభివృద్ధి, స్వాగత తోరణం, కాంపౌండ్‌ వాల్‌, యాత్రికులకు రెస్టు షెల్టర్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, మెట్లు, వాటికి సేఫ్టీగా హ్యాండ్‌ గ్రిల్స్‌, బూత్‌రూంలు, ఖిల్లాపై ఉన్న బావుల ఆధునికీకరణ పనులు, తాగునీటి సదుపాయం, రోడ్డు అభివృద్ధి, రోడ్డు మార్గంలో బెంచ్‌ల ఏర్పాటు, వాటర్‌ సప్లై, శానిటరీ అండ్‌ ఎలక్ర్టికల్‌, ల్యాండ్‌ స్కేప్‌ వర్క్స్‌తోపాటు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలను పర్యాటక శాఖ ద్వారా తయారు చేశారు. త్వరలో పనులను ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఫ రామగిరి దుర్గం(ఖిల్లా) చరిత్ర ఇది..

క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితం రామగిరి వెలిసినట్లు చరిత్ర వివరిస్తోంది. క్రీస్తు శకం 62వ సంవత్సరంలో గౌతమి పుత్రశాతకర్ణి, 86వ సంవత్సరంలో పులోమావి ఈ ప్రాంతాన్ని పాలించినట్లు పెద్దబొంకూరు, గుంజపడుగు గ్రామాల్లో లభ్యమైన ఆధారాలు పేర్కొంటున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధిపరిచి బలీయంగా తీర్చిదిద్దారట. క్రీస్తు శకం 1158వ సంవత్సరం లో చాళుక్య గుండరాజును ఓడించి కాకతీయుల రామగిరి దుర్గాన్ని వశపర్చుకున్నారని, ప్రతాపరుద్రుడు 1195 వరకు ఈ దుర్గాన్ని పాలించాడని ఓరుగల్లు, మంత్రకూట ముల శాసనాలు తెలియజేస్తున్నాయి. అనంతరం బహ్మ నీసుల్తానులు ఈ దుర్గాన్ని ఆక్ర మించుకోగా వారి నుంచి రెడ్డి రాజైన కాటయ వేమారెడ్డి స్వాధీన పర్చుకున్నట్లు, మళ్లీ మహమ్మదీయులు వశపర్చుకొని నైజాం కాలం వరకు ఏలినట్లు చరిత్రకారులు పేర్కొం టున్నారు. రామగిరి కోటలో ఇరువైపుల తొమ్మిది ఫిరంగులు, నలభై తోపులు ఉన్నట్లు, వాటిలో నుంచి ఆరు తోపులు చెన్నూర్‌ దేశ్‌ముఖ్‌లు తీసుకువెళ్లినట్లు స్థానికులు చెబుతారు. 1442-57 మధ్య కాలంలో సుల్తానుల ఆధీనంలో, 1595 సంవత్సరంలో మొఘలా యిలు, 1606లో గోల్కొండ నవాబు ఆధీనంలో ఈ కోట ఉన్నట్లు సమాచారం.

ఫ రాచరిక నిర్మాణాలెన్నో..

దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగే కోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల, కొలువు శాల, మొఘ ల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థిలి వాటితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు, కోట ముఖ ద్వారాలు, చెరసాలలు, కొలనులు, యుద్ధం కోసం వినియోగించిన ఫిరం గులు, ఇక్కడ దర్శనమిస్తాయి. పునాదులు, రాళ్లు, ఇటుకలు, మంచినీటి బావువల ఆనవాళ్లు నేటికీ ఇక్కడ కనిపిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలు ఉన్న స్థలంలో కొండచరియ కింద వెయ్యి మంది తలదాచుకోవచ్చు.

ఫ శ్రీరాముడు తపస్సు చేసిన గుహ..

శ్రీరాముడు వన వాస కాలంలో రామగిరి కోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కొండపై నుంచి వచ్చే నీటి ధార బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ధార వద్ద సీతాదేవి స్నానమాచరించేదని ప్రతీతి. ఈ కొండపై సీతారా ముల విగ్రహాలతో పాటు నంది విగ్రహం ఉంది. నీటి ధార నేరుగా శివలింగం, నందివిగ్రహాలపై పడటం విశేషం.

ఫ పరిసరాల్లో వెలసిన గ్రామాలు..

రామగిరి చుట్టు పక్కల ఉన్న ఉళ్లన్నీ ఆనాడు ఆ పట్టణం లోని వాడలని చరిత్ర చెబుతోంది. ఇప్పటి బేగంపేటలో నాడు రాజుల ఆస్థానంలో సంగీత, గాన, నృత్య, కచేరీలు నిర్వహించే బోగం వారు ఉన్నందున బోగంపేట అని పిలిచేవారట. ప్రస్తుతం బేగంపేటగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. మహమ్మదీయుల కాలంలో బేగంలను ఉంచడం వల్ల బేగం పేట అని పేరు వచ్చిందని పలువురు చెబుతున్నారు. రామగిరి పక్కన పోతన పేరుతో పోతారం, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో లక్కారం, నాగళ్లను నిలిపే చోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగే(చోటు) ప్రాంతాన్ని శుక్రవారంపేట అని, మైదంపిండి విసురు రాయి ఉన్న వీధికి మైదంబండ అని పేర్లు వచ్చాయని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోం ది. రామగిరి ఖిల్లాపై ఉన్న సుందర దృశ్యాలు, ప్రాకారాలు, సందర్శకుల ను ఇట్టే ఆకర్షిస్తాయి.

ఫ ఖిల్లా చరత్రకు అక్షర రూపం..

ఈ దుర్గం చరిత్రను కొంత వరకు వెలికితీసిన ఘనత పెద్దపల్లికి చెం దిన ఆర్‌. బాలప్రసాద్‌కు దక్కగా, అంతకు ముందే రామగిరి చరిత్రను పుస్తక రూపంలో వెలువరించిన ఘనత మంగపేటకు చెందిన యరబాటి బాబురావుకు దక్కింది. కమాన్‌పూర్‌కు చెందిన మాధవరావు బలరామ దాసు రామగిరి మహత్యం పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు.

ఫ కేంద్ర మాజీ మంత్రి పాదయాత్ర..

రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గతం లో కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగరరావు బీజేపీ ఆధ్వర్యంలో పాదయా త్ర చేసి రామగిరి దుర్గాన్ని సందర్శించారు. ఇక్కడ పురాతన కట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రధాన రహదారి నుంచి కోట వరకు రోడ్డు నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు ఇరవై లక్షల రూపాయలను కేటాయించగా నక్సలైట్ల హెచ్చరికలతో నిలిచిపోయింది. ఆ తర్వాత అప్పటి కలెక్టర్‌ నీతూకుమారిప్రసాద్‌ ఖిల్లాను సందర్శించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని ప్రకటించారు.

ఫ శ్రావణ మాసంలో సందడి..

ప్రకృతిఅందాలకు, చారిత్రాత్మకతకు చిహ్నంగా నిలిచిన రామగిరి ఖిల్లా పై శ్రావణ మాసంలో పర్యాటకుల సందడి నెలరోజుల పాటు కొనసాగు తుంది. శ్రావణ మాసంలో ప్రతి సోమ, శనివారాల్లో పాఠశాలల, కళాశా లల విద్యార్థులు, ఆధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, యువకులు, మహిళ లు, భక్తులు భారీగా తరలివచ్చి రామగిరి ఖిల్లాను సందర్శిసిస్తారు. గుట్ట పైన దాదాపు 6 కిలోమీటర్లు అడవీలో కాలిబాటన కొండలు ఎక్కుతూ దిగుతూ.. సెలయేరులు దాటుతూ.. రాజులు నిర్మించిన కోటలు, కోట ముఖ ద్వారాలు, చెరసాలలు, కొలనులు, యుద్ధ ఫిరంగులు, శిల్పకళా సంపదను తనివీతీరా చూసే పర్యాటకులు మానసిక ఆనందానికి లోనవు తారు. ప్రకృతి అందాల ఒడిలో పిండివంటలు, వనభోజనాలతో సామూ హికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. చివరగా కొండ గృహలో ఉన్న శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను దర్శించుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొంది తిరుగుప్రయాణమవుతారు.

Updated Date - Jan 13 , 2025 | 01:55 AM