యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్‌కు సహకరించాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:47 AM
రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం క్రింద నిరుద్యోగ యువతీ యువకులతో వివిధ వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్‌కు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు.

సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం క్రింద నిరుద్యోగ యువతీ యువకులతో వివిధ వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్‌కు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజీవ్ యువ వికాసంపై మండల ప్రత్యేక అధికా రులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో వీసి ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సం దీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం నిరు ద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లాలో బ్యాంక్ బ్రాంచీల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యూనిట్ల లక్ష్యాలను కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయల వరకు వంద శాతం సబ్సిడీ, లక్ష రూపాయల వరకు 90 శాతం సబ్సిడీ, 2 లక్షల వరకు 80 సబ్సి డీ, 4లక్షల వరకు 70శాతం సబ్సిడీతో యూనిట్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 27 వరకు వచ్చిన రాజీవ్ యువ వికా సం దరఖాస్తులను మండలాల వారిగా, మున్సిపాలిటీలలో ప్రత్యేక బృందాలను బ్యాంకర్లతో కలిసి ఏర్పాటు చేసి స్కూట్రిని చేయాలని, అర్హుల జాబితాను ఎంపిక చేసి జిల్లాకు పంపాలన్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆమోదంతో తుది జాబితా రూపొందిస్తామన్నారు. ఏప్రిల్ 27వరకు మండల స్థాయిలో విచారణ పూర్తిచేసి లబ్ధిదారు ల జాబితా తయారు చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికా ర్జున్, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.