CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు

ABN, Publish Date - Jan 29 , 2025 | 03:28 AM

బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ పిచ్చోడు.. తిక్కలోడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఆయనకు శ్వేతపత్రం అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. ఒప్పందాలు రహస్యంగా చేసుకుంటే, అప్రకటిత సమాచారం ఏమైనా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతారని గుర్తు చేశారు. దావో్‌సలో తాము చేసుకున్న

CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు
KTR vs CM Revanth Reddy

‘గుర్తింపు’ రోగంతో బాధపడుతున్నడు.. వైద్యం చేయించుకుంటే రిలీఫ్‌ ఫండ్‌ ఇస్తా

రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఆ ఒక్కడికే బాధ

ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టిండు

కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

1.78 లక్షల కోట్ల ఒప్పందాలన్నీ అమలుచేస్తాం

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా

ప్రకృతి వనంగా తెలంగాణ

ఎకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ

టెంపుల్‌, హెల్త్‌ టూరిజంతో మరింత గుర్తింపు

మరిన్ని పెట్టుబడులు, మరింత ఆదాయం: రేవంత్‌

ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు ప్రారంభం

ఈ పార్క్‌ హైదరాబాద్‌కు తలమానికం: చిరంజీవి

తన సంపాదన అంతంతమాత్రమేనంటూ...

మొక్కల కొనుగోలుపై మాట్లాడుతూ ఛలోక్తి

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ పిచ్చోడు.. తిక్కలోడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఆయనకు శ్వేతపత్రం అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. ఒప్పందాలు రహస్యంగా చేసుకుంటే, అప్రకటిత సమాచారం ఏమైనా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతారని గుర్తు చేశారు. దావో్‌సలో తాము చేసుకున్న ఒప్పందాల వివరాలన్నీ ఇప్పటికే ప్రకటించామని, వాటిపై ఏమైనా అనుమానాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని, మీడియాను కూడా తీసుకొని వెళ్లి ఆయా కంపెనీలతో మాట్లాడాలని కేటీఆర్‌కు సూచించారు. ఏదో పదం బాగుంది కదా అని పదే పదే శ్వేతపత్రం అంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ గుర్తింపు సమస్యతో (అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌) బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనల అనంతరం ఇటీవలే నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, టీఎ్‌సఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న కారణంగానే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంతో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముందుకొచ్చిన సంస్థలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.

చాలా ప్రత్యేక విజయం

‘‘దావోస్‌ పర్యటనలో రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. ఇది చాలా ప్రత్యేక విజయం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. అక్రమ నిధులతో కొందరు విష ప్రచారం చేస్తున్నా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వంపై విశ్వాసం చాటాయని కొనియాడారు. ‘‘2004 కంటే ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన విధానాలు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని కొనసాగించింది. ఇప్పుడు కూడా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన విధానాల్లో మేలు చేసేవి ఏమైనా ఉంటే రాజకీయాలను పక్కనబెట్టి మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ విష ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతోందని రేవంత్‌ ఆరోపించారు. తాము విపక్షంలో ఉండగా ఏనాడూ అలా ప్రవర్తించలేదని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే వ్యతిరేకించలేదని అన్నారు. సింగపూర్‌తో చేసుకున్న నైపుణ్యాల అభివృద్ధి ఒప్పందం యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించబోతోందని చెప్పారు.


అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌తో బాధ పడుతున్నడు

అమెజాన్‌, సన్‌ పెట్రో కెమికల్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌... ఇలా అనేక ప్రముఖ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటే కొందరు లేకితనంతో, అజ్ఞానంతో మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఒప్పందాలపై అనుమానాలు ఉండే ధ్రువీకరించుకోవాలని సూచించారు. పెట్టుబడులను స్వాగతించే విశాల హృదయం లేని వారు మౌనంగా ఉండాలని సీఎం సలహా ఇచ్చారు. ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామో జాబితాలు, ఫోటోలు అన్నీ బహిరంగంగానే ఉన్నాయని గుర్తు చేశారు. పెళ్లికి పోతే పెళ్లి కుమారుడిలా, చావుకు పోతే శవంలా అందరి దృష్టీ తనపైనే ఉండాలనే ఒక రకమైన జబ్బుతో కేటీఆర్‌ బాధ పడుతున్నారని రేవంత్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌తో బాధ పడుతున్న నాయకుడిని మంచి డాక్టర్‌కు చూపించాలని, డబ్బులు తక్కువ పడితే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇప్పిస్తానని అన్నారు. ఈ కారు రేసింగ్‌ను రద్దు చేసి పెట్టుబడుల అవకాశాలు దెబ్బ తీశారంటూ తన మీద క్రిమినల్‌ కేసు పెట్టాలంటూ బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంపై రేవంత్‌రెడ్డి స్పందించారు. తాము విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చామని, విదేశాల్లో సొమ్ము దాచుకున్న నేత తరఫున ఫిర్యాదు చేసిన ప్రవీణ్‌ కుమార్‌ బానిస మనస్తత్వం నుంచి బయటకురావాలన్నారు. భారీగా పెట్టుబడులు సాధించినందుకు రాష్ట్రంలో అంతా సంతోషపడుతుంటే ఒకే ఒక్కడు విపరీతంగా బాధ పడుతున్నాడని వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబు కూడా మీడియాతో మాట్లాడారు. ఒప్పందాలతోనే సంబరపడిపోవడం లేదని, ఇవి అమల్లోకి వచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడే విజయం సాధించినట్లని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళనకు సింగపూర్‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. సింగపూర్‌ ఐటీఈతో ఒప్పందంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యునివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ ప్రవేశ పెట్టడానికి వీలు కలిగిందన్నారు. సింగపూర్‌తో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు.దావోస్‌ ఒప్పందాలతో 51,400 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మల్టీవ్యాక్‌ అనే స్విస్‌ కంపెనీ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ‘‘గతేడాది 18 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే అందులో 17 అమల్లో ఉన్నాయి. 10 కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించి 70శాతం పనులు పూర్తయ్యాయి. మరో 7 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి’’ అని వివరించారు.

కొత్తగా రెండు ఐటీ పార్కులు

మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 28: హైటెక్‌ సిటీ తరహాలోనే హైదరాబాద్‌ శివార్లలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రెండు ఐటీ పార్కులకు ఏయే ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయనే విషయమై అధికారులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. నగరంలో ఎక్కడి నుంచైనా ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని సంతోషంగా ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుందని పేర్కొన్నారు.


రేవంత్‌ వల్లే మొబిలిటీ వ్యాలీ రాలేదు

బంధువులు, మిత్రులకు టెండర్లు

ఈ-కార్‌ రేసులో సీఎం అవాస్తవాల ప్రచారం : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్‌, నార్సింగ్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు నష్టం కలుగుతోందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి అమెరికా వెళ్లి తన బంధువులు, స్నేహితులకు టెండర్లు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో, నార్సింగ్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పి వేలాదిమందికి ఉద్యోగావకాశాలు దక్కేవిధంగా మొబిలిటీ వ్యాలీ అనే కార్యక్రమాన్ని సంకల్పించిందని, అయితే రేవంత్‌ రెడ్డి చర్యల వల్ల అది రాకుండా పోయిందని ఆరోపించారు. ఈ-కార్‌ రేసును రద్దు చేయడంతో పాటు అస్తవ్యస్త విధానాలతో తెలంగాణకు రావాల్సిన వేలాది ఉద్యోగావకాశాలు చేజారే పరిస్థితి తెచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డిపై క్రిమినల్‌ కేసు పెట్టి విచారించాలని కోరుతూ నార్సింగి ఠాణాలోలో ఫిర్యాదు చేసినట్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ వెల్లడించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

Updated Date - Jan 29 , 2025 | 08:13 AM