250 కేజీల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు సాఽ్వధీనం
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:27 PM
జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి పట్టణ పోలీసులు నకిలీ అల్లం, వెల్లుల్లి తయారీకేంద్రాలపై దాడులు నిర్వహించి, గురువారం వరకు 250 కేజీల పేస్టును స్వాధీనం చేసుకున్నారు.
- ముగ్గురిపై కేసులు నమోదు
గద్వాల క్రైం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి పట్టణ పోలీసులు నకిలీ అల్లం, వెల్లుల్లి తయారీకేంద్రాలపై దాడులు నిర్వహించి, గురువారం వరకు 250 కేజీల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ గురువారం తెలిపారు. ఇందుకు సం బంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. జిల్లా కేంద్రంలోని గంజిపేట కాలనీలోని సితార ఇండస్ట్రీస్‌లో పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 100 కేజీల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును, తయారీకి ఉపయోగించే రసాయననాలు, పౌడర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. కేంద్రాన్ని నిర్వహిస్తున్న అమీర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని కాటెదాన్‌లో తయారు చేసిన నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో హైదరాబా ద్ నుంచి గద్వాలకు తెచ్చి విక్రయిస్తుండగా వారి నుంచి 150 కేజీల పేస్టును స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు.
Updated Date - Jan 09 , 2025 | 11:27 PM