ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదమ్ముల ఆత్మీయ కలయిక

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:32 PM

ఒకే వంశానికి చెందిన అన్నదమ్ములు 43 మంది సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊరికి చేరుకున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా కలుసుకున్న నారాయణ్‌ వంశానికి చెందిన అన్నదమ్ములు

- నారాయణ్‌ వంశానికి చెందిన 43 మంది

- సంక్రాంతి పండుగ కోసం సొంత ఊరు సిర్సనగండ్లకు రాక

చారకొండ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : ఒకే వంశానికి చెందిన అన్నదమ్ములు 43 మంది సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊరికి చేరుకున్నారు. అందరూ కలిసి వేడుకలు చేసుకున్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా, చారకొండ మండలం, సిర్స నగండ్ల గ్రామానికి చెందిన నారయణ్‌ వంశానికి చెందిన వీరు సోమవారం గ్రామం లోని సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. గ్రామానికి చెందిన నారా యణ్‌ వంశానికి చెందిన వెంకట్‌రెడ్డి వార సుల కొడుకులు, మనుమలు, మునిమలైన వీరందరూ వృత్తి, ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరికి వీలైతే వారు వారు వచ్చి వెళ్లేవారు. కానీ ఈ సారి అందరూ కలుసుకోవాలని నిర్ణ యించుకున్నారు. అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సొంత ఊరికి చేరుకున్నారు. తామంతా రక్త సంబంధీకులమైనా ఫోన్లలో మాట్లాడుకోవడమే కానీ, ఒకేసారి కలుసు కోవడం ఇదే మొదటి సారని వారు తెలి పారు. అందరం కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇకపై ప్రతీ సంవత్సరం సంక్రాంతికి స్వగ్రామానికి వస్తామని తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 11:32 PM