ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

150 ఎకరాల స్థలం గుర్తించేందుకు చర్యలు

ABN, Publish Date - Jan 08 , 2025 | 11:30 PM

జిల్లాలో మహిళా సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 20వ తేదీలోపు 150 ఎకరాల స్థలం గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ విజయేందిర బోయి వివరించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మహిళా సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 20వ తేదీలోపు 150 ఎకరాల స్థలం గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ విజయేందిర బోయి వివరించారు. బుధవారం ప్రజాభవన్‌ నుంచి మంత్రులు సీతక్క, కొండ సురేఖతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్ని జిల్లాల కలెక్టర్లతో పలు అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జడ్చర్ల మండలం బాదెపల్లి సబ్‌స్టేషన్‌లో ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి నాలుగు ఎకరాల స్థలం గుర్తించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌ రావు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి

ప్రతీ కళాశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ విజయేందిర బోయి సూచించారు. బుధవారం కలెక్టర్‌లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. యాంటీ మాదక ద్రవ్యాల నియంత్రణకు యాంటీ డ్రగ్‌ కమిటీలు ప్రతీ కళాశాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కమిటీ నెలవారిగా సమావేశం జరపాలని, జండర్‌ సెన్సిటీవిటీ పై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి కౌసర్‌ జౌహాన్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.కృష్ణ, ఎక్సైజ్‌, అటవీ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాల, కళాశాలల ప్రిన్సిపాల్‌లు హాజరయ్యారు.

Updated Date - Jan 08 , 2025 | 11:30 PM