నేడు ఆంధ్రజ్యోతి బంపర్‌ డ్రా

ABN, Publish Date - Mar 21 , 2025 | 11:14 PM

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్‌ అండ్‌ బైక్‌ రే్‌స బంపర్‌ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ అప్పన్నపల్లిలోని తిరుమలహిల్స్‌లో గల ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నేడు ఆంధ్రజ్యోతి బంపర్‌ డ్రా

మహబూబ్‌నగర్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్‌ అండ్‌ బైక్‌ రే్‌స బంపర్‌ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ అప్పన్నపల్లిలోని తిరుమలహిల్స్‌లో గల ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాఠకుల నుంచి ‘ఆంధ్రజ్యోతి’ కూపన్లు పెద్ద ఎత్తున ఎడిషన్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. జిల్లా ఎడిషన్‌ పరిధిలో జరిగే లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా బైక్‌, ద్వితీయ బహుమతిగా 185 లీటర్ల రిఫ్రిజిరేటర్‌, తృతీయ బహుమతిగా 32 ఇంచుల ఎల్‌ఈడీ టీవీ ఇవ్వనున్నారు. అదేవిధంగా 100 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:14 PM