ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అకాల వర్షానికి తడిసిన మిరప

ABN, Publish Date - Apr 03 , 2025 | 11:27 PM

జోగుళాంబ గద్వాల జిల్లా లోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

ఇటిక్యాల పాడులో కల్లాల్లో తడిసిపోయిన మిరప

- రాజోలిలో ఉరుములతో కూడిన వర్షం

- ఉండవల్లి, రాజోలిలో వర్షానికి ముద్దయిన మిరప, మొక్కజొన్న..

- అలంపూరులో తడిసిన పొగాకు

- పరిహారం అందించాలని రైతుల డిమాండ్‌

రాజోలి/ఉండవల్లి/అలంపూరు ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా లోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న పంటలు తడిసిపోయాయి. రాజోలి, ముండ్లదిన్నె, తూర్పు గార్లపాడు గ్రా మాల్లో గురువారం మధ్యాహ్నం కురిసిని భారీ వర్షానికి ఆర బెట్టిన మిరప, మొక్కజొన్నలు తడిసిపో యింది. దాదాపు గంటన్నర వర కు కురువడంతో పొలా ల్లోకి నీరు చేరింది. పలుచోట్ల చిన్నచిన్న వాగులు, వంకలు పారడంతో రాకపోకలు నిలిచాయి. ఉండవల్లి, ఇటిక్యాలపాడు గ్రామాల శివారు పంటపొలాల్లో రైతులు నిల్వ ఉంచిన మిరప పూర్తిగా తడిచిపోయింది. దీంతో తాము త్రీవంగా నష్టపోయామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో దాదాపు 200 ఎకరాలోకు పైగా మిరప సాగు చేశారు. చేతికి అందిన పంటను పొలాల్లో నిల్వ చేశామని తెలిపారు. కాగా గురువారం మధ్యాహ్నం కురిసిన ఆకాల వర్షానికి మిరప పూర్తిగా తడిచి పోయింది. అ తడిచిన పంటకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలంపూరు మండలంలో గురువారం కురిసిన అకాల వర్షానికి పొగాకు పంట తడిసిపోయింది. తడిసిన పంట నాణ్యత తగ్గుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ యాజమాన్యాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పొగాకు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 03 , 2025 | 11:27 PM