ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:13 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి

- మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి

నారాయణపేట టౌన్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నాగూ రావునామాజీ నివాసంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేస్తామని ఆశ చూపి రైతులను కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. రైతుభరోసా ఇప్పటి వరకు అందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతు న్నాయని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిం చారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

పట్టణ, మండల కమిటీల ఎన్నిక

నారాయణపేట జిల్లాలోని ఆయా మండ లాలు, పట్టణాల బీజేపీ కమిటీ అధ్యక్షులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, గోవర్దన్‌గౌడ్‌తో కలిసి కమిటీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. నారాయణపేట పట్టణ అధ్యక్షుడిగా పి.వినోద్‌, మండల అధ్యక్షురాలిగా సీహెచ్‌.జ్యోతి, మక్తల్‌ మండల అధ్యక్షుడిగా ప్రతా ప్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడిగా బాయికాటి రాజశేఖర్‌ రెడ్డి, కోస్గి మండల అధ్యక్షుడిగా పాలెం ప్రశాంత్‌, దామరగిద్ద సంజీవగౌడ్‌, మరికల్‌కు వేణుగో పాల్‌, ధన్వాడ శివరాజ్‌, కోయిల్‌కొండకు మధుసూదన్‌, మాగనూరు, కృష్ణ మండలాలకు కలిపి ఎన్‌.నర్సప్ప, ఆత్మకూరు భూపాల్‌, అమరచింత మంగల లావణ్య, నర్వ అజిత్‌సింహారెడ్డి, మద్దూ రు కమ్మరి శంకర్‌ పేర్లను ప్రకటించారు.

Updated Date - Jan 09 , 2025 | 11:13 PM