సర్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ

ABN, Publish Date - Mar 23 , 2025 | 11:22 PM

మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణ ఆదివారం గార్లపాడులోని నివాసానికి వెళ్లి పార్టీ ముఖ్యనేతలతో కలిసి డాక్టర్‌ సర్వేశ్వ ర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.

సర్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ

నివాళులర్పించిన ఎంపీ డీకే అరుణ

ధరూరు, మార్చి23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నీలోఫర్‌ హాస్పిటల్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి ఇటీవ ల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణ ఆదివారం గార్లపాడులోని నివాసానికి వెళ్లి పార్టీ ముఖ్యనేతలతో కలిసి డాక్టర్‌ సర్వేశ్వ ర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెవెంట పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:22 PM