పాత ఎంపీడీవో కార్యాలయంలో మంటలు

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:31 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాల యంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి.

పాత ఎంపీడీవో కార్యాలయంలో మంటలు
గదిలో ఎగిసిపడుతున్న మంటలు

- దస్ర్తాల అడుగున మృతదేహం లభ్యం

- అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు

బిజినేపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా, బిజినేపల్లి మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాల యంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పి వేశారు. కాలిపోయిన ఫైళ్లను తొలగిస్తుండగా వాటి కింద ఓ మృతదేహం బయటపడటం సంచలనం సృష్టించింది. సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెండేళ్ల క్రితం కొత్త భవనంలోకి ఎంపీడీవో కార్యాలయాన్ని మార్చారు. ఆ తర్వాత పాత ఎన్నికల సా మగ్రి, స్టేషనరి, ఫైళ్లను అక్కడే భద్ర పరిచారు. ఆ కార్యాలయంలో ఆదివా రం సాయంత్రం మంటలు చెలరేగాయి. అటు గా వెళ్తున్న స్థానికులు గమనించి పో లీసులకు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బం దికి సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు లోకి తెచ్చారు. ఎన్నికల సామగ్రి రూం ప క్కనే గోడ బయట ఉన్న టీఫైబర్‌ ఏసీ కేబుల్‌, తలుపులు, కిటికీలు, పైకప్పు కాలి పోయింది. మంటలను అదుపు చేసిన త ర్వాత కాలిపోయిన ఫైళ్లు, పాత ఎన్నికల సామగ్రిని ఒక్కొక్కొటిగా బయటకు తీసు కొస్తుండగా, దస్త్రాల అడుగున కాలిపో యిన మగ మనిషి మృతదేహం కనిపిం చింది. అతడిని ఎవరైనా చంపి అక్కడ ప డేసి నిప్పు పెట్టారా? లేదా దేని కోసమైనా లోనికి వెళ్లి మంటల్లో చిక్కుకొని చనిపో యాడా? అన్న అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. కొంతకాలంగా భవనంలో టీ ఫైబర్‌ సిబ్బంది పని చేస్తున్నారని, వారు అప్పుడప్పుడు వచ్చి పోతుంటారని ఎంపీడీ వో కార్యాలయ సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.ఐదు లక్షల మేర నష్టం సంభవించి ఉండొచ్చని చెప్పా రు. ఈ ఘటనపై జూనియర్‌ అసిస్టెంట్‌ సుధీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Feb 09 , 2025 | 11:31 PM