ఘనంగా వైకుంఠ ఏకాదశి
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:29 PM
నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైకుంఠ ఏకా దశి వేడుకలు పలు దేవాలయాల్లో ఘనంగా జరిగాయి.
- ఉత్తర ద్వారం ప్రవేశంతో ఆలయాల్లో పోటెత్తిన భక్తజనం
నారాయణపేట/నారాయణపేట రూరల్/ మక్తల్/మక్తల్ రూరల్/కృష్ణ/ధన్వాడ/మాగ నూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైకుంఠ ఏకా దశి వేడుకలు పలు దేవాలయాల్లో ఘనంగా జరిగాయి. భక్తులు ఉపవాస దీక్షలను చేపట్టి ఆలయాలను సందర్శించుకొని పూజలు నిర్వ హించి, మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలోని మాణికేశ్వరి ఆలయం, మక్తల్ పడమటి ఆంజ నేయస్వామి, గుడెబల్లూర్ వేంకటేశ్వరస్వామి, ఎక్లాస్‌పూర్ తిమ్మప్ప ఆలయంతో పాటు నారా యణపేటలోని శక్తిపీఠం, రాఘవేంద్రస్వామి, సత్యనారాయణ, సాయిబాబా, పాండురంగ, అవ ధూత నరసింహాస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. జిల్లా కేంద్రమైన నారాయణ పేట సరాఫ్ బజార్‌లోని బాలాజీమందిర్‌లో మ హేశ్వరి సంఘం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను కనుల పండువగా నిర్వహిం చారు. అర్చకులు విద్యాధర్, ధరణిధర్, ధీరజ్‌దీక్షి త్‌లు మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహిం చారు. పళ్ల అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వేకువజామున ఐదు గం టల నుంచి జ్యోషి రఘుప్రేమచార్య సుప్రభాత సేవ నిర్వహించగా, ఆలయ అర్చకుడు శ్రీపాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా, పేట మండలంలోని కోటకొండ నరసాచలం, పురాతన శివాలయం, కొల్లంపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఎక్లాస్‌పూర్ తిమ్మప్ప దేవాలయంతో పాటు, పలు గ్రామాల్లోని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి ఉపవాస దీక్షలు చేపట్టారు.
మక్తల్ పట్టణంలోని వివిధ ఆ లయాలు భక్తులతో పోటెత్తాయి. నగరేశ్వరస్వామి ఆలయంలో ఉ త్తర ద్వారం గుండా భక్తులు జనార్దనస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అలాగే మండ లంలోని వివిధ ఆ లయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భం గా ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
కృష్ణ మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీవెంకటరమణ దేవస్థానంతో పా టు, గూడెబల్లురు గ్రామంలోని స్వ యంభూలక్ష్మి వేంక టేశ్వరస్వామి దేవా లయంలో అర్చకు లు నారాయణభట్, శ్రీకాంత్‌లు శుక్రవారం తెల్లవారు జామున ప్రత్యే క పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సం ఖ్యలో తరలి రావడంతో దేవాలయాలు కిక్కిరిసి పోయి, ప్రజలు బారులు తీరారు.
ధన్వాడలోని వేంకటేశ్వరస్వామి దేవాల యంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. సాయి సరస్వతి విద్యామందిర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త సుంకు నర్సిములు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిం చారు.
మాగనూరు మండల కేంద్రంతో పాటు, కొల్పూరు గ్రామంలోని వైష్ణవ దేవాలయాల్లో పురోహితులు శుక్రవారం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేయించారు. విశేష పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
Updated Date - Jan 10 , 2025 | 11:29 PM