నెలాఖరులోగా ఇంటి పన్ను వసూలు చేయాలి

ABN, Publish Date - Mar 12 , 2025 | 11:19 PM

ఈ నెలాఖ రులోగా ఇంటి పన్నుల వ సూలును పూర్తి చేయాలని వనపర్తి జడ్పీ సీఈవో యా దయ్య పేర్కొన్నారు.

నెలాఖరులోగా ఇంటి పన్ను వసూలు చేయాలి

ఆత్మకూరు , మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : ఈ నెలాఖ రులోగా ఇంటి పన్నుల వ సూలును పూర్తి చేయాలని వనపర్తి జడ్పీ సీఈవో యా దయ్య పేర్కొన్నారు. ఆత్మ కూరు పట్టణ కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయ ఆవ రణలో కమిషనర్‌ శశిధర్‌ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది, బిల్‌ క లెక్టర్ల సమావేశానికి ఆయన బుధవారం హాజరై మాట్లాడారు. ఆత్మకూరు పట్టణ కేంద్రంలో రెం డు కోట్లకు పైగా ఇంటి పన్నులు వసూలు కా వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 47 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇది వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా తమ ప్రాపర్టీ ని బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులు మా ర్చి 31లోగా తమ ప్రాపర్టీని బుకింగ్‌ చేసుకుం టే రిజిస్ర్టేషన్‌ ఖర్చుల్లో 25 శాతం రాయితీ పొందవచ్చని తెలిపారు. ఎంపీడీవో శ్రీపాద, వా ర్డు ఆఫీసర్లు, మునిసిపల్‌ సిబ్బంది, బిల్‌ కలెక్ట ర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:19 PM