ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ స్థలాల పరిశీలన

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:10 PM

మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ప్రభుత్వ స్థలాన్ని పేట కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పరిశీలించారు.

అప్పిరెడ్డిపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- మండలాల్లో సోలార్‌ పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌

నారాయణపేటరూరల్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ప్రభుత్వ స్థలాన్ని పేట కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల భూమిని గుర్తించాలని ఆదేశించగా కలెక్టర్‌ పట్టణంలోని 17 సర్వే నెంబర్‌లో భూమిని పరిశీలించారు. 57.28 ఎకరాల భూమి ఉందని ఆర్డీవో రాంచందర్‌నాయక్‌ కలెక్టర్‌కు వివరించారు. జిల్లా మొత్తంగా అన్ని మండలాల్లో దాదాపు 196 ఎకరాల ప్రభుత్వ స్థలాల్లో సోలార్‌ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు స్థలాన్ని పరిశీలించామని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ రామకృష్ణ, సర్వేయర్‌ తదితరులున్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

నారాయణపేట టౌన్‌ : జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టిక ఆహారంపై ఆమె ఆరా తీశారు. జిల్లాలో కంటైనర్‌లో కొనసాగుతున్న అం గన్‌వాడీ కేంద్రాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని కలెక్టర్‌ ప్రశ్నించగా నర్వ మండలం యాంకీ గ్రామంలో మరొకటి ఉందని అధికారులు తెలి పారు. కాగా, కంటైనర్‌లో కేంద్రాన్ని కొనసాగించ డం ఇబ్బందిగా ఉందని డీడబ్లూవో జయ కలెక్టర్‌కు విన్నవించారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

తెలంగాణ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ పేట జిల్లా క్యాలెండర్‌ను కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ గురువారం ఆవిష్కరించారు. ఆర్డీవో రాంచందర్‌, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు రవి, శ్రీకాంత్‌ తదితరులున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:11 PM