ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:32 PM
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో విడత జనరల్, వృత్తివిద్యా ప్రయోగ పరీక్ష కేం ద్రాలను ఆదివారం డీఐఈవో, పరీక్షల జిల్లా క న్వీనర్ హృదయరాజు తనిఖీ చేశారు.

గద్వాల సర్కిల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ రెండో విడత జనరల్, వృత్తివిద్యా ప్రయోగ పరీక్ష కేం ద్రాలను ఆదివారం డీఐఈవో, పరీక్షల జిల్లా క న్వీనర్ హృదయరాజు తనిఖీ చేశారు. గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ కృష్ణవేణి జూనియర్ కళాశాల, శ్రీవిద్య ఒకేషనల్ జూనియర్ కళాశాల, గద్వాల శివారు పుటాన్‌పల్లి సమీపం లో ఉన్న గిరిజన బాలికల సంక్షేమ గురుకుల కళాశాలను తనిఖీచేశారు. ఉదయం సెషన్‌లో ఇంటర్ జనరల్ ప్రయోగ పరీక్షలకు 420 మం ది విద్యార్థులకు413 విద్యార్థులు హాజరయ్యారు. 98మంది గైర్హాజరయ్యారని డీఐఈవో తెలిపారు. వృత్తివిద్యా ప్రయోగ పరీక్షలకు 80మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 76మంది హాజరయ్యారని, మధ్యాహ్నం సెషన్‌లో జనరల్ ప్ర యోగ పరీక్షలకు 189 మంది విద్యార్థులకు వం దశాతం హాజరయ్యారని, వృత్తి విద్యా ప్రయోగ పరీక్షలకు 133 మంది విద్యార్థులకు 129మంది హాజరయ్యారని తెలిపారు.
Updated Date - Feb 09 , 2025 | 11:33 PM