చర్చలకు ఆహ్వానించి, సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Jan 01 , 2025 | 11:34 PM
విద్యాశాఖలో కీలక విధులు నిర్వహించే సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే చర్చలకు ఆహ్వానిం చి వాళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని మ హబూబ్‌నగర్ లోకసభ సభ్యురాలు డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచన
గద్వాల టౌన్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో కీలక విధులు నిర్వహించే సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే చర్చలకు ఆహ్వానిం చి వాళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని మ హబూబ్‌నగర్ లోకసభ సభ్యురాలు డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో ఇచ్చి న హామీ మేరకు రెగులరైజ్ చేసి మాట నిలుపుకోవాలని ముఖ్యమంత్రికి హితవుపలికా రు. బుధవారం స్థానిక ఆర్‌డీవో కార్యాలయం వద్ద సమ్మె శిబిరానికి వెళ్లిన ఆమె, ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి బీజేపీ తరఫున వ్యక్తిగతం గా తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్లు తెలిపారు. 20రోజులుగా రోడ్లపై ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకరమన్నారు. వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించి వారి న్యా యమైన డిమాండ్లను ఆమోదించాలని, వారి సమస్యలకు శాశ్వతపరిష్కారం చూపాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి స్వయం గా ఈ విషయం పై జోక్యం చేసుకోవాలన్నారు. ఉద్యోగులు ముఖ్య మంత్రి రేవంత్‌రె డ్డి మాస్క్‌లను ముఖాలకు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
Updated Date - Jan 01 , 2025 | 11:35 PM